తనకు రజనీకాంత్ కాల్ చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ.. తన ఆనందాన్న అభిమానులతో పంచుకున్నారు గోపీచంద్ మలినేని. ఇది నమ్మలేని క్షణం. సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ సార్ నుంచి ఫోన్ వచ్చింది అంటూ ఖుషీ ఖుషీ అయ్యారు. వీర సింహారెడ్డి సినిమా ఎంతో నచ్చిందని రజనీకాంత్ చెప్పినట్లు గోపీచంద్ తెలిపారు.