SP Balasubrahmanyam: గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ఆయనకు వివిధ చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు రాజకీయాలకు అతీతంగా నివాళులు అర్పించారు. భారతీయ సినీ సంగీతానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. తాజాగా రాజేంద్ర ప్రసాద్, కంగనా రనౌత్‌తో పాటు విజయ్ ఆంటోని వాళ్ల సినిమా షూటింగ్ సెట్లో ఎస్పీబీకి నివాళులు అర్పించి సినీ సంగీతానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.