రాజశేఖర్ అంటే ముఖ్యంగా గుర్తుకువచ్చేవి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలే అయినా..ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యే పాత్రలతో కూడా మెప్పించి కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఎన్ని సినిమాలు చేసినా.. రాజశేఖర్ అంటే ఆడియన్స్ ముందు ఆయన చేసిన యాంగ్రీ మెన్ పాత్రలే గుర్తుకు వస్తాయి. అందుకే తెలుగు ఇండస్ట్రీలో ఈయన్ని యాంగ్రీ యంగ్ మెన్‌గా పిలుస్తూ ఉంటారు. ఈయన కెరీర్లో రామ్ చరణ్ ‘ధృవ’ సహా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. (Twitter/Photo)
ఐతే.. రాజశేఖర్ ఒక మూసకు పరిమితం కాకుండా.. కథ నచ్చితే.. హీరోగానే కాకుండా.. విలన్‌గా యాక్ట్ చేయడానికి ఎలాంటి మెహమాటం లేదంటున్నాడు. అన్ని కుదిరితే..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘థృవ’లో అరవింద్ స్వామి పాత్ర కోసం ముందుగా రాజశేఖర్‌ను అనుకున్నారట. ఐతే చివరకు ఆ పాత్రను అరవింద స్వామితోనే తెలుగులో చేయించారని రాజశేఖర్..అప్పట్లో ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. (Twitter/Photo)
గత కొన్నేళ్లుగా హీరోగా సక్సెస్‌లేని రాజశేఖర్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గరుడవేగ’తో ట్రాక్‌లో పడ్డాడు. ఆ తర్వాత ‘కల్కి’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాడు. గతేడాది ‘శేఖర్’ మూవీతో పలకరించారు. ఈ మూవీకి టాక్ బాగున్నా.. ఫైనాన్స్ ప్రాబ్లెమ్స్ కారణంగా థియేటర్స్‌లో అర్థాంతరంగా ఆగిపోయంది. హిట్ కావాల్సిన సినిమా ఇలా కావడంతో ఒకింత డీలా పడ్డారు రాజశేఖర్.(Twitter/Photo)
‘ధృవ’ సినిమా తమిళంలో ‘తనీ ఒరువన్’ సినిమాకు రీమేక్. తెలుగులో రామ్ చరణ్‌తో తెరకెక్కిద్దామనుకున్నపుడు అక్కడ అరవింద స్వామి పోషించిన స్టైలిష్ విలన్ పాత్రను తెలుగులో రాజశేఖర్‌తో చేయిద్దామని దాదాపు ఖరారు అయిందట. లాస్ట్ మినిట్‌లో ఆ పాత్రను అరవింద్ స్వామి చేసాడు. ఇక తమిళంలో అరవింద్ స్వామి ఒక్కడే ఉన్న చాలా సీన్స్ ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా షూట్ చేయాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశ్యంతో తెలుగులో కూడా అరవింద్ స్వామినే తీసుకున్నారు. ఈ రకంగా అల్లు అరవింద్‌కు బడ్జెట్ కలిసి రావడంతో రాజశేఖర్‌కు విలన్‌గా నటించే ఛాన్స్ మిస్ అయింది.
ఒక్క రామ్ చరణే కాదు.. ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’లో విలన్‌గా రాజశేఖర్ పేరు ప్రస్తావన వచ్చింది. అంతకు ముందు చిరు హీరోగా నటించిన ‘స్నేహం కోసం’లో విజయ్ కుమార్ చేసిన పాత్ర కోసం రాజశేఖర్‌ను అనుకున్నారట. ఐతే.. యంగ్ గా ఉన్న మీరు ఆ క్యారెక్టర్‌కు సూట్ కారని చిరు చెప్పారట. మరేదైన మంచి పాత్ర ఉంటే తప్పకుండా చేద్దాం అని చిరు అప్పట్లో అన్నారని రాజశేఖర్ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉంటారు. (Twitter/Photo)