Rajamouli - Ram Charan | తెలుగు సినీ ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్. ముఖ్యంగా టాలీవుడ్లో దర్శకత్వంలో నటించిన హీరో నెక్ట్స్ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా చిరంజీవి, నటించిన ‘ఆచార్య’ సినిమాకు వస్తోన్న టాక్ బట్టి చూస్తే.. రాజమౌళి సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Twitter/Photo)
‘ఆచార్య’ సినిమా విషయానికొస్తే.. చిరంజీవి, రామ్ చరణ్ వంటి హీరోలున్న అసలు కథే లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్లోగా సాగే కథనంతో ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్షపెట్టిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు మెగా హీరోలు కలిసి నటించినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించే అవకాశాలు లేవనే టాక్ అయితే వినిపిస్తోంది. (Twitter/Photo)
చిరంజీవి భోళా శంకర్,ఆచార్య రన్ టైమ్,ఆచార్య మూవీ నిడివి,ఆచార్య ట్రైలర్ టాక్,చిరంజీవి ఆచార్య,ఆచార్య" width="1600" height="1600" /> సినీ ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్‌కు నిలయం. ఇక్కడ తుమ్మినా.. దగ్గినా.. నిలుచున్న అన్నింటికీ సెంటిమెంట్‌తో ముడిపెడుతూ ఉంటారు. అది మంచి జరిగినా.. చెడు జరిగినా గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ సెంటిమెంట్‌ను రగిలిస్తూ ఉంటారు. అందులో కొన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ ఉంటే.. ఇంకొన్ని గుడ్ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. అలానే చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీని కొన్ని గుడ్ మరియు బ్యాడ్ సెంటిమెంట్స్ ఉన్నాయనే ప్రస్తావన మరోసారి మొదలైంది. (Twitter/Photo)
‘ఆచార్య’ మూవీలో గుడ్ సెంటిమెంట్స్ విషయానికొస్తే.. ఈ సినిమాలో తొలిసారి తండ్రీ తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ ఈ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చనిపోతుందనే టాక్ నడుస్తోంది. గతంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’, ‘ఎవడు’ చిత్రాల్లో చనిపోయే పాత్రల్లో నటించారు. ఆయా సినిమాలు సూపర్ హిట్టైయ్యాయి. అదే కోవలో ‘ఆచార్య’కు రామ్ చరణ్ పాత్ర సిద్ధ చనిపోవడం కలిసి వస్తోందని అభిమానులు ఆశా భావం వ్యక్తం చేసారు. కానీ టాక్ చూస్తే.. మాత్రం ఈ సినిమా కోలుకోవడం కష్టమే అంటున్నారు. (Twitter/Photo)
మరోవైపు ఆచార్య సినిమాను డైరెక్ట్ చేసిన కొరటాల శివ విషయానికొస్తే.. ఈయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’ భరత్ అను నేను’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. రాజమౌళి తర్వాత అపజయం ఎరగని దర్శకుడి పేరు గాంచాడు. మరి ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు కలిసొస్తుందని అనుకున్నారు. కానీ కొరటాల శివ మాత్రం ఎపుడో 20 యేళ్ల క్రితం తీయాల్సిన స్టోరీని ఇపుడు తెరకెక్కించారు. అది కూడా స్లోగా నేరేషన్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిందనే చెప్పాలి. (Twitter/Photo)
ఆచార్యను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ విషయానికొస్తే.. ఏ హీరో అయినా.. రాజమౌళి దర్శకత్వంలో నటించిన తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతూ ఉంటాయి. తాజాగా రామ్ చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. మరి ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘ఆచార్య’ సినిమాతో ఆ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి హిట్ అందుకుంటారని అందుకు అనుకున్నారు. కానీ ఈ సినిమా టాక్ చూస్తుంటే.. రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. ఈ సినిమా ముందు ముందు ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. Acharya Photo : Twitter
చిరంజీవి, రామ్ చరణ్ మొదటి సారి.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో ఓ పాటలో చిరు కాసేపు కనిపించి అలరించారు. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీలో చిరు గెస్ట్ పాత్రలో అలరించారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’లో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటలో రామ్ చరణ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఈ రకంగా తండ్రి తనయులు ఇప్పటికే మూడు సార్లు అభిమానులు కనువిందు చేశారు. తాజాగా ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో నటించారు. ఈ సినిమ మెగాభిమానులకు తీపి కానుక అని చెప్పాలి. (Twitter/Photo)
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు నక్సలైట్స్ పాత్రల్లో కనిపించి కనువిందు చేశారు. (Twitter/Photo)