దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలకు అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టి అబ్బుర పరిచింది. కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక ఇండియాలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) లో స్ట్రీమింగ్ అవుతోం Photo : Twitter
అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ కేటగిరీ అన్నది కూడా ఫైనల్ అయిపోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. విజువల్ ఎఫెక్ట్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ అకాడెమీ అవార్డులకు నామినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఇంటర్నేషనల్ మ్యాగజైన్ వెరైటీ వెల్లడించింది. అమెరికాతోపాటు జపాన్‌లోనూ ఆర్ఆర్ఆర్ మూవీని రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
చరిత్రలో కలవని ఇద్దరు యోధులను ఈ సినిమా ద్వారా రాజమౌళి కలిపి చరిత్ర సృష్టించారు.ఈ విధంగా స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు సినమా ఖ్యాతిని ఖండంతరాలు దాటించేశారు. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు ‘బాహుబలి-2’ పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి తన పేరిట నమోదు చేసుకుంది.