RRR Working stills: వైరల్ అవుతున్న ‘RRR’ వర్కింగ్ స్టిల్స్.. ఎన్టీఆర్, చరణ్‌తో పాటు ఆమె కూడా..

RRR Working stills: రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ ట్రిపుల్ ఆర్ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో వేగంగా జరుగుతుంది. కేవలం పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోయింది. సినిమాను అనుకున్నట్లుగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సినిమా లొకేషన్ స్టిల్స్ (RRR Working stills) వైరల్ అవుతున్నాయి. ఇందులో రామ్ చరణ్(Ram Charan), జూనియర్ ఎన్టీఆర్‌(Jr NTR)తో పాటు ఒలివియా మోరీస్ కూడా ఉన్నారు.