ట్రిపుల్ ఆర్ సినిమాతో రికార్డులు తిరగరాస్తున్నాడు రాజమౌళి. పాజిటివ్ టాక్ కూడా ఉండటంతో ఈ సినిమా మునుపెన్నడూ ఇండియన్ సినిమా చూడని రికార్డులు తిరగరాస్తుంది. ఏపీ, తెలంగాణలో 191 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రానికి పర్ఫెక్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. రెండు రోజుల్లో 105.11 కోట్ల షేర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చాయి. రెండో రోజు ఏపీ, తెలంగాణలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం..