SS Rajamouli K Raghavendra Rao | దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్ మొదట్లో తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర రైటర్ గా పనిచేసి.. కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ వర్క్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ మెలుకువలు నేర్చుకున్నారు. త్వరలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్గణ్లతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పలకరించబోతున్నారు. (Twitter/Photo)
రాఘవేంద్రరావు దగ్గర ఒకటి రెండు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన రాజమౌళి.. ఆ తర్వాత ‘శాంతి నివాసం’ సీరియల్‌కు సహాయ దర్శకుడిగా పనిచేసి.. రాఘవేంద్రరావు, అశ్వనీదత్ నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘స్టూడెంట్ నెం.1’తో మెగాఫోన్ పట్టుకొని దర్శకుడు అయ్యారు. ఇక ఏప్రిల్ 28 1977లో రాఘవేంద్రరావు.. ఎన్టీఆర్ హీరోగా ‘అడవి రాముడు’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అటు 2017 ఏప్రిల్ 28న రాఘవేంద్రరావు తన శిష్యుడు రాజమౌళి దర్శకత్వంలో ఆయన సమర్పణలో ‘బాహుబలి 2’ విడుదలై ఇండస్ట్రీ హిట్ నమోదు చేయడం విశేషం. తాజాగా కే.రాఘవేంద్రరావు తన దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు హీరోగా ‘పెళ్లి సందడి’ సినిమాతో పలకరించడమే కాదు.. నటుడిగా తన లక్ పరీక్షించుకున్నారు. ఈ సినిమా డివైడ్ టాక్‌తో మంచి కలెక్షన్సే రాబట్టింది. (Twitter/Photo)
ప్రముఖ యాక్షన్ దర్శకులు బి.గోపాల్ కూడా ముందుగా పి.చంద్రశేఖర్ రెడ్డిగా అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘అడవి రాముడు’ నుంచి ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరి పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడుగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రామానాయుడు నిర్మించిన ‘ప్రతిధ్వని’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. (Twitter/Photo)
కే.రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ . ఈయన దర్శకేంద్రుడు తెరకెక్కించిన కూలీ నెం. 1 సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రామానాయుడు సమర్పణలో సురేష్ బాబు నిర్మించిన వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో దర్శకుడిగా ప్రమోషన్ పొందారు. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్,నాగార్జున, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను డైరెక్ట్ చేసారు. (Twitter/Photo)