సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటతో రాబోతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా ఈ చిత్రం మే 12న 2022 విడుదలకానుంది. ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక అది అలా ఉంటే మహేష్ ఈ రోజు తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్ళారు. ఇక మరోవైపు ఈరోజు ఉదయం ఎస్ఎస్ రాజమౌళి కూడా దుబాయ్‌కి బయలు దేరినట్లు తెలుస్తోంది.
రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ చిత్రం కోసం దుబాయ్ వెళ్తున్నట్లు చర్చ జరగుతోంది. యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఇక దుబాయ్‌కు వెళ్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక రాజమౌళి విషయానికి వస్తే.. అగ్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli ) ఆర్ ఆర్ ఆర్ (RRR) (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఓ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో రాజమౌళి (Rajamouli ) మరింత ఉత్సాహాంగా మహేష్ బాబుతో (Mahesh Babu) సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కోసం రాజమౌళి రెండు కథల్నీ రెడీ చేశారట. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ రాజమౌళి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. మహేష్ కోసం తన వద్ద రెండు కథలున్నాయని పేర్కోన్నారు రాజమౌళి. ఇటీవల కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ వాయిదా పడ్డప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దని తన తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ సూచించడంతో ఆ ఖాళీ సమయంలో మహేష్ సినిమాపై పని చేశామని తెలిపారు. అప్పుడే మహేష్ కోసం రెండు కథల్నీ రెడీ చేశామని.. అన్నారు.
ఆ రెండింటిలో మహేష్‌కు ఏది నచ్చితే అది సినిమా కథ అవుతుందని.. అన్నారు. ఈ సినిమా 2022 చివర్లో షూటింగ్‌కు వెళ్లవచ్చని టాక్.ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ఏమంటే.. ఈ సినిమాను రాజమౌళి దాదాపుగా 800 కోట్లతో భారీగా రూపొందించనున్నారట. ఈ సినిమా అడ్వెంచర్ డ్రామా అని, RRR, బాహుబలి కంటే పెద్దదిగా ఉండబోతోందని టాక్.
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహేష్ సరసన హిందీ హీరోయిన్ (Alia Bhatt) ఆలియా భట్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి RRRలో సీత పాత్రలో నటించిన (Alia Bhatt) ఆలియా భట్ మరోసారి రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా నటించనుందని అంటున్నారు. ఆ మేరకు (Alia Bhatt) ఆలియా భట్‌తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించనున్నారు. సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహేష్ బాబు, రాజమౌళితో సినిమా చేయాలని కెఎల్ నారాయణ దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో చాలా వీఎఫ్ఎక్స్కు అవకాశం ఉందట.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంది. కాగా షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని తెలిపింది చిత్రబృందం. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను వదిలారు..
ఇక ఇప్పటికే మహేష్ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేయడంతో పాటు పూర్తవ్వడం కూడా జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్నట్లుగా మే 12, 2022 న భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దానికి తగినట్లుగానే పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను వేగం గా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే మహేష్ తన డబ్బింగ్‌ను పూర్తి చేయగా.. మరో నటుడు సముద్ర ఖని కూడా తన పార్ట్ డబ్బింగ్ ను పూర్తి చేశారట. సముద్ర ఖని ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.