Rajamouli - Boyapati Sreenu | అవును డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రియేట్ చేసిన ఆ రికార్డును దర్శక బాహుబలి రాజమౌళి ఇప్పటికీ బ్రేక్ చేయలేక చేతులేత్తేసారు. ఇంతకీ ప్యాన్ ఇండియా దర్శకుడిగా సత్తా చాటుతున్న రాజమౌళికి సాధ్యం కానీది.. బోయపాటి శ్రీను సాధ్యమైన ఆ రికార్డు ఏమిటా అనే విషయానికొస్తే.. (File/Photo)
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్,వి.వి.వినాయకల తర్వాత మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ తప్ప ఇప్పటి వరకు ఈయన బడా స్టార్ హీరోలనేతో సినిమాలు తెరకెక్కించారు. ఈయన ఎవరితో సినిమా తీసినా.. ఇది ఫలానా హీరోకు తగ్గట్టు తెరకెక్కించడంతో పాటు అందులో తనదైన శైలిలో తెరకెక్కించడం బోయపాటి శ్రీను శైలి.
టాలీవుడ్లో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన రాజమౌళితో సాధ్యం కానీ కొన్ని రికార్డులను తన పేరిట రాసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు బోయపాటి శ్రీను. దర్శకుడిగా ఈయన తొలి చిత్ర అవకాశాన్ని దిల్ రాజు ఇచ్చారు. ఆయన బ్యానర్లో రవితేజ హీరోగా ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. (File/Photo)
ఆ సంగతి పక్కన పెడితే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ సినిమా కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో తెరకెక్కించిన ‘జయ జానకి నాయక’ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయ్యాయి. అంతేకాదు ఈ చిత్రాలు హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా సూపర్ హిట్టయ్యాయి. సరైనోడు’ చిత్రం ‘సరైనోడు’పేరుతో హిందీలో యూట్యూబ్‌లో దాదాపు 1000 మిలియన్ వ్యూస్ సాధించి ఔరా అనిపించింది
ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో తెరకెక్కించిన ‘జయ జానకి నాయక’ సినిమా ’జయ జానకి నాయక కూంకార్’ పేరుతో హిందీలో డబ్ చేస్తే అక్కడ ఈ చిత్రం..300 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఈ రకంగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ రెండు చిత్రాలు యూట్యూబ్ హిందీ డబ్బింగ్ వెర్షన్ 300 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసాయి. ఈ రకంగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన రెండు చిత్రాలు హిందీ డబ్బింగ్ వెర్షన్ 300 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం చెప్పుకోదగ్గ విశేషం. .
భారతీయ దర్శకులెవరికీ ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఈ రెండు చిత్రాల్లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కావడం విశేషం ఈ రకంగా రాజమౌళే కాదు.. ఏ హీరోకు సాధ్యంకానీ రికార్డులను తన సినిమాలతో చేసి చూపించి దర్శకుల్లో నిజంగానే తోపు అనిపించుకుంటున్నారు బోయపాటి శ్రీను. మరి భవిష్యత్తులో రాజమౌళికి ఈ రికార్డు యూట్యూబ్ వేదికగా బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఓటీటీ వేదికగా విడుదలయ్యే సినిమాల కారణంగా యూట్యూబ్‌లో విడుదల చేయడం ఏ నిర్మాతలు. ఈ రకంగా బోయపాటి శ్రీను రికార్డు పదిలంగా ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. (File/Photos)