Mahesh Babu - Raja Kumarudu @ 22 Years | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘రాజ కుమారుడు’ సినిమా విడుదలై నేటితో 22 ఏళ్లు కంప్లీట్ అయింది. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ నిర్మించారు. ఇక అప్పటి వరకు బాల నటుడిగా ప్రేక్షకులను మెప్పించిన మహేష్ బాబు.. ఈ చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు.
ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో నటించారు. అంతేకాదు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్- బాలకృష్ణ, ఏఎన్నార్-నాగార్జున, తర్వాత తండ్రి కొడుకుల కాంబినేషన్లో రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘రాజ కుమారుడు’. ఇలా ముగ్గురు బడా హీరోలు, వాళ్ల కొడుకులతో చిత్రాలను తెరకెక్కించిన ట్రాక్ రికార్డు దర్శకుడిగా కే.రాఘవేంద్రరావు సొంతం. (Twitter/Photo)
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో కథానాయికగా ప్రీతి జింతా నటించింది. హీరోగా మహేష్ బాబు ఫస్ట్ మూవీ కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఓ కొత్త హీరో కోసం అంత ఖర్చు చేయడం.. పైగా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా సక్సెస్ కాకపోవడంతో ఈ నెగిటివ్ కామెంట్స్ వినబడ్డాయి. (Twitter/Photo)
1999 జులై 30న విడుదలైన రాజకుమారుడు సంచలన విజయం సాధించి మహేష్ బాబు కెరీర్‌కు కావాల్సిన పునాదిని బాగా గట్టిగా వేసింది. రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. రూ. 4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. కొన్ని ఏరియాల్లో అశ్వనీదత్ ఓన్‌గా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఫైనల్‌గా ఈ చిత్రం రూ. 11 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది. తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా సరిగా పర్ఫామ్ చేయలేదు. (Twitter/Photo)