Vadinamma serial: స్టార్ మాలో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రస్తుతం ఎంతో ఉత్కంటంగా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో శైలు నిజం తెలుసుకొని తన తండ్రిని దూరం పెడుతుంది. రఘురాం కు ప్రశాంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి సీత సేఫ్ అని చెప్పడంతో సీత నినన్నే బయలుదేరింది అనడంతో అందరూ కంగారు పడతారు. ప్రశాంత్ ఎంక్వయిరీ చేయగా సీత వచ్చే బస్సు యాక్సిడెంట్ అయిందని అనడంతో రఘురాం స్పృహ కోల్పోతాడు. కుటుంబం అంత బాధ లో ఉండగా పార్వతమ్మ, దుర్గమ్మ దగ్గరికి వచ్చి సూటిపోటి మాటలతో సీత కుటుంబాన్ని మరింత బాధ పెడుతుంది. ఆమె మాటలను భరించలేని రఘురామ్ ఆవేశంతో ఊగిపోతాడు. ఇక భాస్కర్.. రఘురాం తో ధైర్యంగా ఉండని చెబుతాడు. ఇక బస్టాండ్ కి వెళ్లి వివరాలు తెలుసుకుందామనే సమయంలో భాస్కర్ కి ఫోన్ రావడంతో భరత్ వచ్చి వాళ్లని వెనుకకు పంపించి తను కోయంబత్తూర్ వెళ్తాడు. అక్కడ సీతామహాలక్ష్మి పేరుతో ఎంక్వయిరీ చేయగా ఆ పేరుతో ఎవరూ లేరంటూ లోయలో పడి బాడీ కూడా దొరికనట్లు అర్థంతో ఆశలు వదులుకోవాల్సిందే అని చెప్పడంతో భరత్ షాక్ అవుతాడు.