Jr Ntr: ఎన్టీఆర్ జోలికొస్తే ప్రాణం తీస్తా.. ఆయనే కాబోయే సీఎం! కమెడియన్ రఘు సంచలన వ్యాఖ్యలు
Jr Ntr: ఎన్టీఆర్ జోలికొస్తే ప్రాణం తీస్తా.. ఆయనే కాబోయే సీఎం! కమెడియన్ రఘు సంచలన వ్యాఖ్యలు
Raghu Karumanchi: తెలంగాణ యాసలో మాట్లాడుతూ వెండితెరపై వినోదం పంచే కమెడియన్ రఘు.. తాజాగా ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ జోలికొస్తే ప్రాణం తీస్తా అంటూ ఓపెన్ అయ్యారు రఘు.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం కమెడియన్ రఘు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ వెండితెరపై వినోదం పంచే ఆయన.. డిఫరెంట్ మేనరిజంతో అందరికీ దగ్గరయ్యారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రఘు..సినిమాల్లోకి రావడంతో ఆయన్ను జూనియర్ ఎన్టీఆర్ చాలా ప్రోత్సహించారట.
2/ 9
ఆది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రఘు.. ఆ తరువాత అదుర్స్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన మ్యానరిజంతో బిజీ కమెడియన్‌గా మారి.. దాదాపు 220పైగా చిత్రాల్లో నటించారు. అయితే తనను జూనియర్ ఎన్టీఆర్ ఎలా ప్రోత్సహించారో కమెడియన్ రఘు స్వయంగా వెల్లడిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
3/ 9
సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటున్న రఘును కమెడియన్‌గా మార్చి ఇండస్ట్రీ వైపుకు తీసుకొచ్చింది డైరెక్టర్ వివి వినాయక్. రఘుకు చాలా క్లోజ్ అయిన వివి వినాయక్ చొరవతో సినిమాల్లో అడుగుపెట్టారు. ఆది సినిమాతో ఎంటర్ అయ్యారు. అయితే ఆ సమయంలోనే ఎన్టీఆర్ తో మంచి స్నేహబంధం ఏర్పడిందట.
4/ 9
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ రఘు మాట్లాడుతూ ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ జోలికొస్తే చంపడానికైనా చావడానికైనా రెడీ అని చెప్పిన రఘు.. ఎన్టీఆర్ కోసం ప్రాణం ఇవ్వడమే కాదు.. ఎవడి ప్రాణం తీయమన్నా తీసేస్తా అని ఓపెన్ గా చెప్పేశారు.
5/ 9
ఎన్టీఆర్ అంటే తన బాడీలో ఓ పార్ట్ అని చెప్పారు రఘు. ఆయన చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారని, ఆయనకు ఏ ఒక్కరితో కూడా గ్యాప్ రాలేదని అన్నారు. ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు శక్తి. గొప్ప టాలెంట్ ఉన్ననటుడు అని పేర్కొన్నారు.
6/ 9
తాతకి తగ్గ మనవడు ఎన్టీఆర్ అని.. ఆయన వస్తేనే టీడీపీ పూర్వవైభవం రావడమే కాదు భవిష్యత్‌లో ఖచ్చితంగా సీఎం అవుతారంటూ రఘు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ ఇష్యూ అయ్యాయి. రఘు మాటలకు నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
7/ 9
ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి అక్కడక్కడా డిస్కషన్స్ నడుస్తున్నా.. ఎన్టీఆర్ మాత్రం ఈ విషయమై రియాక్ట్ కావడం లేదు. తన సినిమాలు తాను చేసుకుంటూ వరల్డ్ వైడ్ క్రేజ్ కొట్టేస్తున్నారు.
8/ 9
ఇప్పటికే RRR సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్.
9/ 9
ప్రెజెంట్ అమెరికాలో ఉన్నారు. RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ పొందటంతో అక్కడికి చేరుకున్నారు ఎన్టీఆర్. RRR టీంతో కలిసి విదేశాల్లో ఆయన సందడి చేస్తున్నారు.