Home » photogallery » movies »

RAGHAVA LAWRENCE PROVES GENEROUS NATURE AGAIN HELPED TO A GAJA CYCLONE VICTIM MS

Photos : అన్నీ కోల్పోయిన అవ్వకు అండగా లారెన్స్.. గొప్పోడివి సామీ..

నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. గతేడాది గజ తుఫాన్‌ ధాటికి సర్వం కోల్పోయిన ఓ అవ్వకు అండగా నిలిచారు. గజ తుఫాన్ కారణంగా ఆ వృద్దురాలి ఇల్లు ధ్వంసమవగా.. ఆమె కోసం లారెన్స్ కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చాడు. ఇందుకోసం దాదాపు రూ.10లక్షలు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇటీవలే గణేశన్ అనే కారు డ్రైవర్‌కు కూడా లారెన్స్ సొంత ఇంటిని నిర్మించి ఇచ్చాడు. గతంలోనూ చిన్నారులు, వికలాంగులకు ఆర్థికంగా లారెన్స్ చాలానే సహాయం అందించారు. లారెన్స్ గొప్ప మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.