Radhe Shyam - Punarjanma | పునర్జన్మ అనాదిగా మనిషికున్న ఒక ఆసక్తి. అంతేకాదు మనిషి తర్కానికి అందకుండా తప్పించుకుని తిరుగుతున్న ఒక ఆశ్చర్యం. ఇపుడు ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాధే శ్యామ్’ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలైతే కానీ ఇది పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిందా లేదా అనే విషయమై క్లారిటీ వస్తోంది. మొత్తంగా చిత్ర పరిశ్రమలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల విషయానికొస్తే...
పునర్జన్మ అనాదిగా మనిషికున్న ఒక ఆసక్తి. అంతేకాదు మనిషి తర్కానికి అందకుండా తప్పించుకుని తిరుగుతున్న ఒక ఆశ్చర్యం. మనిషి విజ్ఞానాన్ని సవాల్ చేస్తున్న ఒక అద్భుతమనే చెప్పాలె. ఈ అద్భుతాన్ని మన సినిమా వాళ్లు మంచిగనే క్యాష్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పునర్జన్మ నేపథ్యాన్ని మన సినిమా వాళ్లు...హిందూ పురాణాల్లో ఉన్న దశావతారాలు...బుద్దుని జాతక కథలను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించారు. ఈ రకంగా వెండితెరపై పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. పునర్జన్మ మనిషి ప్రగాఢంగా వాంఛిస్తున్న ఒక సంభవం. పునర్జన్మ మనిషిని నిత్యం జాగృతం చేస్తున్న ఒక భయం అనే చెప్పాలి. (File/Photo)
ఇక 90 ఏళ్లకు దగ్గరపుడుతోన్న తెలుగు సినీ చరిత్రల పునర్జన్మలు సూపర్ హిట్ మంత్రమని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది.తెలుగుల పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల విషయానికొస్తే...ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘మూగ మనసులు. ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్లో....ఏఎన్నాఆర్, సావిత్రి, జమున లీడ్ రోల్ల నటించిన ఈ మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిపోయింది. (File/Photo)
జానకి రాముడు కంటే తెలుగులో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన మరో సినిమా ’దేవదాసు మళ్లీ పుట్టాడు’. దాసరి నారాయణ రావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ. ఈ సినిమాలో వాణిశ్రీ అక్కినేని నాగేశ్వరరావుకు జోడిగా నటించింది.ఇక ఏఎన్నార్ మంజుల హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘బంగారు బొమ్మలు’ మూవీ కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కడం విశేషం. (File/Photo)
అటు 1985ల బాలకృష్ణ, సిల్మ్ స్మిత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆత్మ బలం’ కూడా పునర్జన్మలను బేస్ చేసుకొని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమా హిందీలో సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో రిషీ కపూర్ హీరోగా ‘కర్జ్’ టైటిల్‌తో తెరకెక్కింది. అక్కడ హిట్టైన మూవీ.. తెలుగులో మాత్రం సక్సెస్ అందుకోలేదు. (File/Photo)
ఆ తర్వాత తెలుగుల చాలా ఏళ్ల తర్వాత కే.రాఘవేంద్రరావు .. వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన ‘సుభాష్ చంద్రబోస్’ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిందే. ముందు జన్మలో తనని చంపిన వారిపై మరు జన్మలో పగ తీర్చుకోవడమనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. (File/Photo)
ఆ తర్వాత అదే యేడాది రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘మగధీర’ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. రామ్ చరణ్, కాజల్ నటించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. గత జన్మల ప్రేమలో ఓడిపోయిన హీరో, హీరోయిన్లు నెక్ట్స్ జన్మలో మళ్లీ ఒకటైపోతారు. (File/Photo)
అటు ఇదే రూట్లో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘ఈగ’ ఏ స్టార్ ఇమేజ్ లేకపోయినా....పునర్జన్మ సబ్జెక్ట్ లో ఉన్న దమ్ము ఏంటో చూపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సూపర్ హిట్‌గా నిలిచిందో తెలిసిందే కదా. ఈ సినిమాలో విలన్ సుదీప్‌ను ఈగ ఏ రకంగా ముప్పతిప్పలు పెట్టిందో చూసాము కదా. నాని.. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కంటే పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయం సాధించింది. (File/Photo)
అటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం హోల్ సేల్ గా నటించిన ‘మనం’ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంల తెరకెక్కినదే. అటు అక్కినేని వంశానికి పునర్జన్మలకు ఏదో లింకు వున్నట్టే వుంది. అటు ఏఎన్నాఆర్, నాగార్జునలు ఈ తరహా సబ్జెక్ట్స్ ను విడి విడిగా చేసి మంచి సక్సెస్‌ను అందుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య ఆళ్ల తాత ఏఎన్నార్, నాయన నాగార్జునలతో కలిసి చేసిన ‘మనం’ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కడం పెద్ద విచిత్రమనే చెప్పాలె. (File/Photo)
అటు తెలుగులనే కాదు...వేరే భాషలల్ల కూడా పునర్జన్మ అనేది సక్సెస్ ఫార్ములాగా అనే చెప్పాలె. హిందీ సినిమాల విషయానికొస్తే...కమల్ ఆమ్రోహి దర్శకత్వంలో అశోక్ కుమార్, మధుబాల జంటగా 1949ల వచ్చిన ‘మహల్’ అప్పట్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. హిందీ చిత్ర సీమలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన తొలి సినిమా ఇదే. ఈ మూవీతో హీరోయిన్ గా మధుబాల, గాయనిగా లతా మంగేష్కర్ వెనుదిరిగి చూసుకోలేదు. (File/Photo)
1981ల చేతన్ ఆనంద్ డైరెక్షన్ల రాజేశ్ ఖన్నా, వినోద్ ఖన్నా, హేమామాలిని హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘కుద్రత్’ మూవీ కూడా పునర్జన్మల మూవీస్‌లో ఒక ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 1980ల సుభాష్ ఘాయ్ డైరెక్షన్ల తెరకెక్కిన ‘‘కర్జ్’’ కూడా పునర్జన్మలను బేస్ చేసుకొని తెరకెక్కించిన మూవీనే. పెళ్లి చేసుకున్న అమ్మాయి చేతిల హత్యకు గురైన ఒక ప్రేమికుడు...పునర్జన్మ ఎత్తి ఆమె నేరాన్ని నిరూపిస్తాడు. (File/Photo)
రిషీ కపూర్, టీనా మునీమ్, సిమీ గెరెవాల్ నటించిన ఈ మూవీ ఆ యేడాది రిలీజైన హిందీ మూవీస్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదే చిత్రాన్ని బాలకృఫ్ణ ‘ఆత్మ బలం’గా రీమేక్ చేస్తే అంతగా నడవలేదు. అటు హిందీలనే కర్జ్ మూవీని 2008ల అదే టైటిల్ తో హిమేష్ రేష్మియా, ఊర్మిళలతో రీమేక్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (File/Photo)
1995ల రాకేష్ రోషన్ డైరెక్షన్ల సల్మాన్, షారుఖ్ హీరోలుగా తెరకెక్కిన ‘కరణ్ అర్జున్’’ మూవీ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఈ మూవీని ప్రేమకోసం పునర్జన్మ ట్రెండ్ కాకుండా...అమ్మకోసం మళ్లీ పుట్టడం అనే కాన్సెప్ట్‌ను తీసుకొని తెరకెక్కించారు డైరెక్టర్ రాకేశ్ రోషన్. ఈ సినిమాను తెలుగులో ‘కథానాయకులు’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ ఓ రేంజ్లో నడిచింది. (File/Photo)
ఆ మధ్యకాలంల 1997ల కాజోల్, సైఫ్ అలీ ఖాన్ లతో వచ్చిన ‘హమేషా’.. రాజ్ కన్వర్ డైరెక్షన్లో ఆర్య బబ్బర్, అమృతారావు జంటగా వచ్చిన ‘అబ్ కే బరస్’’ ఈ కోవలోనిదే. అటు అంత్రామాలి డైరెక్ట్ చేస్తూ నటించిన ‘‘మిస్టర్ యా మిస్’’ పునర్జన్మ కథా చిత్రాల్లో పెద్ద విచిత్రమనే చెప్పాలి. ఒక జన్మల అఫ్తాబ్ శివదాసానీ...నెక్ట్స్ జన్మల అంత్రామాలిగా జన్మించడం కాస్త వెరైటీ అని చెప్పుకోవాలి. (File/Photo)
అటు కరిష్మా కపూర్ కమ్ బ్యాక్ సినిమా 2012ల వచ్చిన ‘డేంజరస్ ఇష్క్’’ కూడా అదే ఫలితాన్ని చవి చూసింది. ఇందుల కరిష్మా నాలుగు పునర్జన్మలు పొందడం విశేషం.ఇక దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘రాబ్తా’ మూవీ కూడా పునర్జన్మను బేస్ చేసుకొనే తెరకెక్కించారు. మగధీరను ప్రీమేక్ చేసిన ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. మొత్తానికి పునర్జన్మల నేపథ్యాన్ని ‘రాబ్తా’ మూవీ సరిగా క్యాష్ చేసుకోలేకపోయింది. (File/Photo)
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ మూవీలో ప్రభాస్ ..విక్రమాదిత్య క్యారెక్టర్ చేసారు. అటు పూజా హెగ్డే.. ప్రేరణ పాత్రలో నటించింది. సినిమా టైటిల్ ‘రాధే శ్యామ్’ కాబట్టి ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించారా అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. (File/Photo)
ఆర్ఆర్ఆర్ మూవీని కూడా రాజమౌళి మరోసారి తనకు కలిసొచ్చిన పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. పూర్వ జన్మలో స్వాతంత్య్రం కోసం పోరాడుతూ తుది శ్వాస విడుస్తారనేది టాక్. ఆ తర్వాత జన్మలో తాము బ్రిటిష్ వారిని ఎలా ఎదిరించి పోరాడరనేది ఈ సినిమా ఈ స్టోరీ. ఏమో ఇదే కథతో తెరకెక్కుందా లేదా అనేది సినిమా విడుదలైతే కానీ తెలియదు. (Twitter/Photo)
మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘బింబిసార’ కూడా పునర్జన్మల నేపథ్యానికి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ జోడించి తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ‘రాధే శ్యామ్’, ‘బింబిసార’ మూవీలు కూడా పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కయా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీస్ రిలీజెస్ వరకు వేచి చూడాల్సిందే. మొత్తంగా చూసుకుంటే పునర్జన్మ కాన్సెప్ట్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెక్కుచెదరని ఎవర్ గ్రీన్ ఫార్ములా అనే చెప్పాలె. (File/Photo)