సంక్రాంతి రేసు నుంచి ప్రభాస్ రాధే శ్యామ్ కూడా తప్పుకుంది. జనవరి 14న రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ప్రభాస్ సినిమాలకు కేవలం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. తాజాగా ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు. (Twitter/Photo)
బాహుబలితో ప్రభాస్‌కు వందల కోట్ల మార్కెట్ వచ్చేసింది. పైగా సాహో సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలోనూ హిట్ అయింది. అక్కడ 150 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది ఈ చిత్రం. ప్రభాస్ ఎంచుకుంటున్న కథలు.. చేస్తున్న సినిమాలు.. అవి జరుపుకుంటున్న బిజినెస్ అన్నీ పాన్ ఇండియన్ స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పట్లో ప్రభాస్ రేంజ్ ముట్టుకోవడం కూడా కష్టమే. సినిమాకు 150 కోట్ల పారితోషికం అందుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. (Twitter/Photo)
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇదిలా ఉంటే తాజాగా ఈయన తన రాధే శ్యామ్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 14న విడుదల కావాల్సిన రాధే శ్యామ్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమా వాయిదా పడింది. దాంతో పాటు రాధే శ్యామ్ కూడా వాయిదా పడటంతో చిన్న సినిమాలు థియేటర్స్‌కు పోటెత్తుతున్నాయి. ఈ సంక్రాంతికి ఒకేసారి 10 సినిమాలు విడుదల అవుతున్నాయి. అప్పటి పరిస్థితులు బట్టి ఎన్ని సినిమాలు విడుదలవుతాయో చూడాలి. (Twitter/Photo)
అందులో కొన్ని సినిమాలు ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. రాధే శ్యామ్ రాకపోతే అవి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకు అదిరిపోయే ఓటిటి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఈ సినిమాకు రూ. 400 కోట్ల ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.(Twitter/Photo)
కావాలంటే మరో 50 కోట్ల వరకు అదనంగా కూడా ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలతో మాటామంతి సాగుతున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల కింద నెట్ ఫ్లిక్స్ కూడా ఈ చిత్రానికి 300 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై నిర్మాతలు స్పందించలేదు. మరోవైపు ఇప్పుడు అమెజాన్ ఏకంగా మరో 100 కోట్లు అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మేకర్స్ మాత్రం పరిస్థితులు అన్ని కుదటపడ్డాకా.. ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తామనే చెబుతున్నారు. (Twitter/Photo)
అయితే ప్రభాస్ లాంటి హీరో సినిమాను ఓటిటి రిలీజ్ చేయడం అనేది అసాధ్యమే అవుతుంది. ఇలాంటి లవ్ స్టోరీని కేవలం బిగ్ స్క్రీన్‌పైనే చూడాలని నిర్మాతలు చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా విడుదలపై ఓ క్లారిటీ రానుంది. ఒక్కటి మాత్రం నిజం.. ప్రభాస్ లాంటి హీరో సినిమాను ఓటిటిలో విడుదల చేస్తే మాత్రం అంతకంటే సంచలనం మరోటి ఉండదు. (Twitter/Photo)