రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కొన్నేళ్లుగా ఎదురు చూసారు. 2019 సాహో తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. పీరిడికల్ బ్యాక్ డ్రాప్లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే అనుకున్నంత రేంజ్లో ఫస్ట్ డే వసూళ్లను సాధించడంలో కాస్త తడబడింది. ఓవరాల్‌గా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్‌ను సాధించింది. (Twitter/Photo)
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ టోటల్: 38.37 కోట్లు షేర్ సాధించింది. టోటల్ గ్రాస్ విషయానికొస్తే.. రూ. 64 కోట్లతో అన్ని భాషల్లో కలిపి మన దేశంలో 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రాధే శ్యామ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ముందు ముందు ‘ఆర్ఆర్ఆర్’ సహా పలు తెలుగు సినిమాలు ఈ రికార్డు క్రాస్ చేసే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్, రానాల భీమ్లా నాయక్ మూవీ.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా ఫస్ట్ డే తెలుగులో రూ. 36.37 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్ విషయానికొస్తే.. రూ. 56.50 కోట్ల గ్రాస్‌తో 2022లో అత్యధిక ఫస్ట్ డే వసూళ్లను సాధించిన సినిమాల్లో రెండో ప్లేస్‌లో ఉంది. (Bheemla Nayak)
అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వలీమై’. ఈ సినిమాను సిహెచ్ వినోద్ తెరకెక్కించాడు. వలిమై అంటే తమిళంలో బలం అని అర్థం. ఈ పినిమా ఫిబ్రవరి 24న భీమ్లా నాయక్’కు ఒక రోజు ముందు విడుదలైంది. తెలుగులో పవన్ మ్యానియా ముందు తేలిపోయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 50.20 కోట్ల గ్రాస్ వసూళ్లతో 2022లో అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన మూడో సినిమాగా నిలిచింది. (Twitter/Photo)