అయితే తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాశీఖన్నాకు ఈ విషయం తెలుసో తెలియదో మరి.. ఆమె మాత్రం పూలు పెట్టుకొని తిరుమల మాఢ వీధుల్లో కనిపించింది. దీంతో ఆమె ఫోటోలు చూసిన ఓ నెటిజన్ తిరుమలలో పూలు పెట్టుకోరాదు అనే నిబంధన ఉంది కదా అంటూ ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు రాశీ ఖన్న తిరుమల పర్యటన కాస్త కలకలం రేపుతోంది.
ఇప్పుడు రాశీ ఖన్నా పూలు ధరించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిపై ఈ అమ్మడు ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. హీరోగా మారుతి దర్శకత్వంలో నిర్మించిన ‘పక్కా కమర్షియల్ ’ సినిమా జులై 1వ తేదీన విడుదల కానున్న నేపధ్యంలో శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు అందుకున్నారు. తాను నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు నటి రాశీఖన్నా తెలిపారు.