‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతుంది ఈ భామ. తెలుగులో ఈమె మొదట అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించిన ‘మనం’ సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. (Instagram/Photo)
గీతా గోవిందం | అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ సినిమాలో ముందుగా రాశీ ఖన్నా పేరు పరిశీలనకు వచ్చింది. దాదాపు ఆమె ఖరారైంది. చివరకు తన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఆమె ప్లేస్‌లో రష్మిక మందన్న ను తీసుకున్నారు. ఈ సినిమాతో రష్మిక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారింది. (File/Photo)
సర్కారు వారి పాట | పరశురామ్ పెట్లా దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో ముందుగా రాశీ ఖన్నా పేరును పరిశీలించారు. ఒక ప్రొడ్యూసర్స్ ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేయడంతో చివరగా ఈ అవకాశం కీర్తి సురేష్‌కు వరించింది. (File/Photo)