Home » photogallery » movies »

RAASHI KHANNA SINGS FOR SAI TEJ PRATHI ROJU PANDAGE SR

జోరు పెంచిన రాశీ ఖన్నా.. తట్టుకోలేకపోతున్న హీరోయిన్స్..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది. రాశీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. అది అలా ఉంటే రాశీ, సాయి తేజ్ హీరోగా వస్తోన్న 'ప్రతిరోజూ పండగే'లో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. కేవలం నటిగానే కాకుండా రాశీకి ఇంకో టాలెంట్‌ కూడా ఉంది. అదే సింగింగ్‌. తొలిసారి ‘జోరు’సినిమా కోసం గొంతు సవరించుకున్న రాశీ వీలున్నప్పుడల్లా పాటలు పాడుతూ అదరగొడుతోంది. తాజాగా ప్రతిరోజూ పండగేలో కూడా పాడింది. అంతకు ముందు జవాన్‌లో కూడా అదరగొట్టింది. దీంతో ఇటూ నటన అటూ పాటలు పాడుతున్న రాశీ ధాటికి తట్టుకోలేకపోతున్నారు తోటి హీరోయిన్స్.