Raasi Khanna: ఆరెంజ్ టాప్‌లో అదరగొడుతున్న రాశి ఖన్నా..!
Raasi Khanna: ఆరెంజ్ టాప్‌లో అదరగొడుతున్న రాశి ఖన్నా..!
రాశీ ఖన్నా ఫెయిల్యూర్, సక్సెస్‌లతో సంబంధం లేకుండా సినిమలు చేసుకుంటూ పోతుంది. తాజాగా ఈ భామ నటించిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇందులో రాశి నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. ఈసందర్భంగా రాశి ప్రమోషన్లతో బిజీగా మారింది. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంది.
రాశీ ఖన్నా తెలుగులో తొలిసారిగా ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాను 2014లో అవసరాల శ్రీనివాస్ తొలిసారగి దర్శకత్వం వహించారు. ఆయన ఇదే సినిమాలో కీలక పాత్రలో నటించారు కూడా.
2/ 8
తెలుగులో రాకముందే.. రాశీఖన్నా హిందీలో నటించింది. 2013లో వచ్చిన మద్రాస్ కెఫె సినిమాలో రూబీ సింగ్ పాత్రలో నటిచింది రాశీ. ప్రస్తుతం ఈ భామ ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్లో కూడా బిజీగా మారింది.
3/ 8
ప్రస్తుతం రాశీ తెలుగులో థాంక్యూ సినిమాలో నటించింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్గా అలరించనుంది. అంతకుముందు మనం సినిమాలో కూడా రాశి అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. ఈ నెల 22న థాంక్యూ సినిమా విడుదల కానుంది.
4/ 8
ప్రస్తుతం రాశీ థాంక్యూ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఆ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. అటు ప్రమోషన్లు చేస్తూనే ఇటు... సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా పోస్టులు పెడుతుంది. తాజాగా ఆరెంజ్ కలర్ టాప్‌లో మెరిసింది రాశీ.
5/ 8
ఆరెంజ్ కలర్ టాప్ ధరించి .. ఒయలొలికిస్తూ.. దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఈ ఫోటోలకు ‘దిస్ ఈజ్ మై కలర్ ’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక అందాల రాశీ ఫోటోలు చూసిన నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. బ్యూటిఫుల్ ఆరెంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
6/ 8
ఒక ఇటీవలే గోపిచంద్‌కు జంటగా రాశీ నటించిన సినిమా ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాశీ లాయర్‌గా నటించింది. పక్కా కమర్షియల్ అనుకున్న హిట్ సాధించలేకపోయింది. ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
7/ 8
దీంతో ఇప్పుడు రాశీ తన ఆశలన్నీ థాంక్యూ సినిమాపైనే పెట్టుకుంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. మరి ఈ సినిమా రాశీకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
8/ 8
రాశీ ఖన్నా అటు బాలీవుడ్లో బిజీగా మారింది. ప్రముఖ హీరో అజయ్ దేవ్ గన్‌తో కలిసి రుద్ర అనే వెబ్ సిరీస్‌లో రాశీ నటించిన విషయం తెలిసిందే. రాశీ ఖన్నా అటు తమిళ్లో కూడా రెండు మూడు సినిమాలు చేసిన విషయం మనకు తెలిసిందే.