Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది. తాజా సమాచారం మేరకు రాశీ.. అల్లు అర్జున్ సరసన ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. అది అలా ఉంటే.. రాశీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ..వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతిపోగొడుతోంది.