అందులో భాగంగా రోటీ బ్యాంక్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి రాశీఖన్నా హైదరాబాద్‌లో ఉన్న పేదలకు తన వంతుగా తోడ్పాటును అందిస్తున్నారు. అందులో భాగంగా వాలంటీర్స్‌తో కలిసి వృద్ధాశ్రమాలకు, రోడ్డుపై ఉండే జంతువులకు ఆహారాన్ని అందిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Photo : Twitter
ఇక రాశీ ఖన్నా సినిమాల విషయానికి వస్తే.. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ప్రస్తుతం రాశీ ఖన్నా.. ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ సినిమాతో పాటు హిందీలో షాహిద్ కపూర్‌తో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు గోపీచంద్ మారుతి కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలోను నటిస్తున్నారు. Photo : Twitter