Raashi Khanna : బూరెల్లాంటి బుగ్గలతో ‘ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ రాశీఖన్నా. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది ఈ పాల బుగ్గల చిన్నది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడిడడంతో ఆ మధ్య స్లో అయింది. Photo : Instagram
ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ మారుతి కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్ చిత్రంతో పాటు నాగచైతన్య విక్రమ్ కుమార్ థాంక్యూలో కూడా హీరోయిన్గా చేస్తోంది. ఇక అది అలా ఉంటే రాశీ ఖన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను అదరగొడుతోంది. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా.. తాజాగా మరో వెబ్ సిరీస్‌లో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. Photo : Instagram
రాశీఖన్నా తెలుగులో ప్రసారం కానున్న సోనీ లివ్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. సోనీ లివ్ ఇటీవల తెలుగు OTT స్పేస్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోనీ లివ్ రాశీఖన్నాతో ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు కొత్త దర్శకుడు సూర్య వంగల దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ఓ మిస్టరీ డ్రామాగా వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నా డిటెక్టివ్ పాత్ర పోషించనుందట. Photo: Instagram
ఇక రాశీఖన్నా థాంక్యూ సినిమా విషయానికి వస్తే.. ఈ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తుంది. విక్రమ్ ఆ మధ్య నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ 'మనం' సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. Photo: Instagram.com/raashikhannaoffl
రాశీ ఖన్నా మరో సినిమా పక్కా కమర్షియల్,.. మ్యాచో స్టార్ గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. ప్రతిరోజూ పండగే’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు మారుతి చాలా రోజుల గ్యాప్ తర్వాత గోపీచంద్ హీరోగా ఈ సినిమాను స్టార్ట్ చేశాడు. Photo : Instagram