సౌత్ ఇండియన్ మోడల్, హీరోయిన్ రాయ్ లక్ష్మి తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోన్న అందాల నటి. ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది లక్ష్మీ రాయ్. అంతకు ముందు తమిళ సినిమా ‘కర్క కసడర’ మూవీతో పరిచయమైంది. ఈమెకు తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. Photo : Instagram
Raai Laxmi : మొదట్లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో జాతక రీత్యా తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. పలు సినిమాల్లో తన అందచందాలను ఆరబోసింది. ఆమె నటించిన పలు సినిమాలు తెలుగులోకి కూడా అనువాదమై మంచి విజయాలు సాధించాయి. అయితే హీరోయిన్ గానే కాదు .. ప్రతినాయికగా నటించి కూడా ప్రేక్షకులకు దగ్గర కావొచ్చు అని అంటోంది రాయ్‌లక్ష్మీ. Photo : Instagram
దాంతో చేసేదేం లేక అందాల ఆరబోతపై దృష్టిపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇటు తెలుగులో బాలయ్యతో అధినాయకుడులో కథానాయికగా నటించింది. అటు చిరుతో ఖైదీ నంబర్ 150, పవన్ కళ్యాణ్‌తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో ఐటెం భామగా చిందేసింది. ఆ తర్వాత వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, కర్రి బాబ్జీ లాంటి సినిమాలు చేసినా కూడా లక్ష్మీ రాయ్‌కి కలిసిరాలేదు. ఇక ఇతర భాషల్లో అయితే సంచలనాలు క్రియేట్ చేస్తుంది లక్ష్మీరాయ్.
దాంతో పాటు కొన్ని వీడియోలు కూడా చేస్తుంది ఈ భామ. ఇప్పటి వరకు అయితే చిన్న సినిమాలతో కాలం గడిపేస్తుంది కానీ కనీసం ఈ అందాలను చూసిన తర్వాతైనా ఎవరో ఓ పెద్ద దర్శకుడు కరుణించకపోతాడా అని చూస్తుంది లక్ష్మీ రాయ్. ఈమె కర్ణాటకలోని బెల్గాంలో జన్మించింది. పీళ్ల పూర్వీకులది సౌరాష్ట్రియన్ కచ్ ఫ్యామిలీకి చెందిన వారు. అక్కడ నుంచి మూడు నాలుగు తరాల క్రితమే వీరి ఫ్యామిలీ కర్ణాటకలో సెటిలైంది. (Instagram/Photo)
2005లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. అపుడే హీరోయిన్గా 18 యేళ్లు కంప్లీట్ చేసుకోబోతుంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఇన్నేళ్లైన ఇప్పటికీ అదే సోయగంతో అభిమానులను మత్తెక్కిస్తోంది. అంతేకాదు త్వరలో మంచి పాత్రలు వస్తే తెలుగులో చేయడానికి తనకు ఎలాంటి మెహమాటం లేదని చెబుతోంది. ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. (Instagram/Photo)