అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆహార్యం.. ముఖ్యంగా తగ్గేదేలే అంటూ ఆయన చెప్పిన డైలాగులు ప్యాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాను రష్యన్ భాషలో విడుదల చేస్తున్నారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్ సహా మిగతా పుష్ప టీమ్ మెంబర్స్ అక్కడ రష్యన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా గురించి ప్రమోట్ చేసారు. ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ డిసెంబర్ 1న రష్యా రాజధాని మాస్కోలో ప్రదర్శించనున్నారు. అటు డిసెంబర్ 3న మరో స్పెషల్ ప్రీమియర్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రదర్శించనున్నారు. ఇక ఈ సినిమాను అక్కడ డిసెంబర్ 8న విడుదల చేసారు. (Twitter/Photo)
ఫుష్ప సినిమా అక్కడ డిసెంబర్ 8న విడుదలకానుంది. చూడాలి మరి పుష్పకు రష్యా దేశంలో ఎలాంటీ రెస్పాన్స్ రానుందో.. ఇక పుష్ప ది రూల్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను టీమ్ రెడీ చేసిందని తెలుస్తోంది. తాజాగా జరిగిన షూట్లో పుష్ప2 కు సంబంధంచిన టీజర్‌ను షూట్ చేశారట. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను థాయ్ లాండ్లో కొనసాగించనున్నారని తెలుస్తోంది. (Twitter/Photo)
అక్కడే ఓ 30 రోజుల పాటు చిత్రీకరించనున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘పుష్ప 2 లో ఓ అదిరిపోయే ఫైట్ ఉండనుందట. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్‌ను కాపాడే క్రమంలో సింహంతో ఫైట్ చేయాల్సి ఉంటుందట. ఈ సింహంతో పోరాడే సీన్‌ను ఓ రేంజ్లో డిజైన్ చేశారట సుకుమార్. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ పులి సీన్ కంటే మించి ఉంటుందట. (Twitter/Photo)
ఇక ఈ సినిమాలో మొదటి భాగంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్ లుక్‌లో కేక పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్లో కూడా కొద్ది మార్పులతో అదే లుక్‌ను కొనసాగిస్తారట. ఈ సినిమా రెండు భాగాల కోసం అల్లు అర్జున్ రూ. 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. (Twitter/Photo)
ఇక ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నారు. హీరోయిన్గా రష్మిక మందన్న కనిపించనుంది.. అయితే ఆమె పాత్రను కాస్తా తగ్గించనున్నారని తెలుస్తోంది. పుష్పతో వచ్చిన క్రేజ్‌తో పుష్ప2ను ఓ రేంజ్లో అద్భుతంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు సుకుమార్.. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్‌ను బద్దలు కొట్టనుందో.. (Twitter/Photo)