Raja singh vs Devi Sri Prasad: పుష్ప మూవీ సాంగ్ 'ఊ.. అంటావా మావా.. ఊ ఊ అంటవా మావా..' సాంగ్ దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసినా ఈ పాటే మార్మోగుతోంది. ఐతే దీనికి ఎంత క్రేజ్ వచ్చిందో అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే కొందరు కోర్టులో కేసు వేయగా.. తాజాగా మరో వివాదం రాజుకుంది.
తనకు ఐటమ్స్ సాంగ్స్, భక్తి పాటలు ఒక్కటేనిని మ్యూజిక్ డైరెక్టర్ దేవీప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆర్య2లో రింగ రింగ, పుష్పలోని ఊ అంటావా మావ పాటలను.. డివోషనల్ లిరిక్స్‌తో పాటడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2/ 5
దేవీశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. హిందువుల మనోభవాలు దెబ్బతినేలా దేవిశ్రీప్రసాద్ మాట్లాడారని మండిపడ్డారు. హిందూ సమాజానికి ఆయన క్షమాపణలు చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
3/ 5
ఐటమ్ సాంగ్స్‌ని భక్తి పాటలతో పోల్చుతారా అని రాజాసింగ్ విరుచుకుపడ్డారు. హిందువులకు దేవిశ్రీ క్షమాపణలు చెప్పకుంటే.. తెలంగాణలో తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే.
4/ 5
ఇటీవల పుష్ప టీమ్ నిర్వహించిన ప్రెస్మీట్లో 'ఊ అంటావా మావ'.. సాంగ్ వివాదంపై స్పందించిన దేవిశ్రీప్రసాద్.. తనకు ఐటెం సాంగ్స్ అన్నీ భక్తి పాటలే అని చెప్పారు. ట్యూనే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే దేవిశ్రీ తీరుపై రాజాసింగ్ మండిపడుతున్నారు.
5/ 5
శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అక్కడక్కడా నెమ్మదించినా ఓవరాల్‌గా బాగుందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే దుమ్మురేపుతున్నాయి.