Allu Arjun - Pushpa Success Meet | అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప’. డిసెంబర్ 17న విడుదలైన ఈ ప్యాన్ ఇండియా మూవీ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్.. తిరుమల శ్రీవారి పాదాల చెంత తొలి సక్సెస్ మీట్ నిర్వహించారు. (Twitter/Photo)
పుష్ప సినిమాకు 150 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమాకు రూ. 95 కోట్ల షేర్ వచ్చింది. అయితే తర్వాత కూడా ఇదే జోరు కంటిన్యూ అయితే పుష్ప కమర్షియల్‌గా సేఫ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం అంత దూరం వెళ్లడం కష్టమే కానీ బన్నీ నటన చూడ్డానికి థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు ఆడియన్స్. తాజాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి యూఎస్‌లో 2 మిలియన్ డాలర్స్ గ్రాస్‌కు చేరువలో ఉంది. (Twitter/Photo)
ఈ సందర్భంగా పుష్పలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మాట్లాడుతూ.. ఈ సినిమాలో పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ నటనకు జాతీయ అవార్డుతో పాటు అన్ని అవార్డులు ఖచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేసింది. ఒకవేళ రాకపోతే.. తాను హర్ట్ అవుతానని అంది. ఇక సుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి చింపేశారంటూ కామెంట్ చేసింది. (Twitter/Photo)
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ అరాచకం చేసింది. నాలుగో రోజు సోమవారం కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది. సినిమాకు 4వ రోజు కూడా 10 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ముఖ్యంగా హిందీలోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇక తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లోనే 7 కోట్ల షేర్ ఉంది. ఐదో రోజు అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3 కోట్ల వరకు షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. (Twitter/Photo)
ఇక ’పుష్ప’ హిందీ బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడిస్తున్నారు. రూ. 20 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ అక్కడ రూ. 16 కోట్ల వరకు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లతోనే దూసుకుపోతుంది. త్వరలో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను అన్ని భాషల్లోను నిర్వహించే యోచనలో చిత్ర యూనిట్ ఉంది. (Twitter/Photo)