అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ తన టీమ్ మెంబర్స్‌తో కలిసి ‘పుష్ప’ మూవీ స్పెషల్ షోను వీక్షించి ఎంజాయ్ చేశారు. (Twitter/Photo)
దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ట్రైలర్‌తో పాటు పాటలు విడుదలైయ్యాయి. ఇక తాజాగా టీమ్ దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా తాజాగా టీమ్ ముంబై వెళ్లింది. అక్కడ అల్లు అర్జున్, రష్మిక మందన్న, దేవి శ్రీ ప్రసాద్ సందడి చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హిందీ వెర్షన్ పనులు పూర్తి కావడంతో సుకుమార్ ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు. (Twitter/Photo)
మరోవైపు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావా రిలీజై సోషల్ మీడియాలో అదిరే రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. అంతే కాదు ఈ పాట యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తోంది. ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ 24 గంటల్లో నాలుగు భాషల్లో కలిపి 14 మిలియన్ల వ్యూస్‌తో సౌత్ ఇండియాలో మోస్ట్ వ్యూడ్ సాంగ్‌గా నిలిచింది. దీంతో చిత్రబృందం దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే తెలుగులో 30 మిలియన్ పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. (Twitter/Photo)
మొత్తంగా ‘అఖండ’ తర్వాత ‘పుష్ప’తో టాలీవుడ్‌కు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ వచ్చాయనే టాక్ వినబడుతోంది. మొత్తంగా ట్విట్టర్ వేదికగా అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా బాగుందనే చెబుతున్నారు. అల్లు అర్జున్‌తో పాటు రష్మిక, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ వంటి నటీనటులు కూడా ఈ సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించారని చెబుతున్నారు. ఇక సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత పుష్ప మూడో మూవీ. (Twitter/Photo)