Allu Arjun - Sneha Reddy 11th Wedding Anniversary : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలు ఈ రోజు తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల పెళ్లి మార్చి 6, 2011 న జరిగింది. ఈ సందర్బంగా వీరు తమ పెళ్లి రోజు సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. (Instagram/Photo)
కన్నడలో స్టార్ సువర్ణ ఛానల్లో, తమిళ్లో స్టార్ విజయ్‌లో, ఇక మలయాళంలో ఏషియా నెట్లో ప్రసారం కానుంది. హిందీలో మాత్రం గోల్డ్ మైన్స్ ధించక్ టీవీ ఛానల్లో ప్రసారం కానుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా తమిళనాడులో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 30 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఓ తెలుగు సినిమా తమిళ నాడుతో ఈ మార్క్ ని అందుకోవడం చాలా రేర్ అంటున్నారు.. Photo : Twitter
ఇక ఈ సినిమా హిందీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ అందుకోని రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప. Photo : Twitter
సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి స్పష్టం అయ్యిందని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. పుష్ప ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు బిహార్‌లో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా అన్ని భాషల్లో రూ. 365 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. 2021లో అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు సినిమాగా రికార్డులకు ఎక్కింది. Photo : Twitter