రష్మిక మందన్న ఈ మధ్యకాలంలో వరుస వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఆమె ఓ హిందీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక మాట్లాడుతూ.. రొమాంటిక్ సాంగ్స్ ను తెరకెక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్ అని ప్రశంసించారు. Photo : Twitter
అంతేకాదు ఆమె ఇంకా మాట్లాడుతూ.. సౌత్ సినిమాల్లో ఇలా ఉండదని.. సౌత్‌లో ఎక్కువగా మాస్ మసాలా, ఐటెమ్ సాంగ్స్ ఉంటాయని తెలుపుతూ.. కమర్షియల్ హంగులే ఎక్కువగా ఉంటాయంటూ సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా రష్మికపై మరోసారి నెటిజన్స్ మండిపడ్డారు.. రష్మికను ట్రోల్ చేస్తూ.. నువ్వు కన్నడ నుంచి తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో కన్నడ చిత్రాలను తక్కువ చేసి మాట్లాడావు, ఇక ఇప్పుడు హిందీ సినిమాలలో నటించేటప్పటికి సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతున్నావ్. ఇది కరెక్ట్ కాదని, నోటి దూల అంటే ఇదే అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. Photo : Twitter
ఇక ఈ విషయంపై రష్మిక క్లారిటీ ఇస్తూ.. నేను అలా అనలేదని, నేను చెప్పబోయే లోపే డిస్ట్రబ్ అయ్యాయని స్పష్టం చేశారు.. అంతేకాదు సోషల్ మీడియాలో తనపై విపరీతంగా నెగిటివిటీ ఉందంటూ వాపోయారు. అనవసరమైన హేట్, నెగిటివిటీ తమను ప్రభావితం చేస్తాయని అన్నారు. ఇక తాజాగా రష్మిక మరోసారి సోషల్ మీడియాలో నెగిటివిటీపై స్పందిస్తూ.. ఓ పోస్ట్ చేశారు. Photo : Twitter
ఇక లేటెస్ట్గా రష్మిక మందన్న తన పోస్ట్‌లో రాస్తూ.. సంతోషంగా ఉండండి.. జీవితంపట్ల ఆశావాద దృక్పథంతో ఉండండి.. మీ ఆనందం, శ్రేయస్సు అనేవి మీ జీవితంలో అన్నింటి కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగినవి. జీవితం చాలా చిన్నది.. దాంట్లో నెగిటివిటీకి తావు లేదంటూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్క్ ఫ్రంట్‌లో ఆమె ఇప్పుడు తన కెరీర్లో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పుష్ప 2తో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. Photo : Twitter
రష్మిక లేటెస్ట్గా తెలుగులో సీతా రామంతో పలకరించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆమె నటించిన మరో సినిమా గుడ్ బై ఇటీవల విడుదలై ఓకే అనిపించుకుంది. రష్మిక గుడ్‌బైతో పాటు హిందీలో మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హిందీ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించారు. మిషన్ మజ్ను డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు వారిసు అనే తమిళ సినిమాలో నటించారు. తెలుగులో వారసుడుగా డబ్ అయ్యింది. Photo : Twitter
రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో పుష్ప2లో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా రెగ్యూలర్ షూట్ జరుపుకోనుంది. అది అలా ఉంటే ఈ మధ్య హీరోయిన్స్ ఓ వైపు నటిస్తూనే మరోవైపు ఐటెమ్ సాంగ్స్’లో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. గతంలో కాజల్, తమన్నా, పూజా హెగ్డే, సమంత లాంటీ హీరోయిన్స్ చేశారు. ఇక ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది.Photo : Twitter
రష్మిక లేటెస్ట్గా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యడానికి రెడీ అయ్యిందని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్‌లో నటించడానికి రష్మిక దాదాపుగా ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అయితే అంత మొత్తం కూడా ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్లు సోషల్ మీడియా టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఒకవేళా అదే నిజమైతే.. ఈ రేంజ్లో ఓ పాట కోసం ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇదో రికార్డ్ అని అంటున్నారు. Photo : Twitter
ఇక ఇటీవల గుడ్ బై సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక లిప్ లాక్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. ” నాది చాలా సున్నితమైన మనసు. గతంలో నేను చేసిన ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విషయంలో చాలా ట్రోలింగ్‌కు గురైయాను. ఈ రెండు సినిమాల్లోనూ లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. ’గీత గోవిందం’ సినిమాకు పెద్దగా ట్రోలింగ్ జరగలేదు.. అయితే ‘డియర్ కామ్రేడ్’ సమయంలో నేను చాలా ట్రోలింగ్‌కు గురైయాను. నేను కావాలనే పబ్లిసిటీ కోసం విజయ్‌తో అలాంటి సన్నివేశాల్లో నటించానని ఘోరంగా ట్రోల్ చేశారు. ఆ సమయంలో నాకు కొన్నిరోజులు పీడకలలు కూడా వచ్చాయి. Photo : Twitter
రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ అదరగొడుతున్నారు. అయితే ఓ వైపు నటిస్తూనే రాజకీయాల్లోకి కూడా వస్తారనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక కర్నాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీచేయనున్నారట. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు జ్యోతిష్యుడు వేణు స్వామి రష్మిక గురించి చేసిన కామంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. రష్మిక త్వరలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. Photo : Twitter
అంతేకాదు ఏకంగా కర్నాట కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి లోక్ సభ ఎంపీ అవుతారని ఆయన అంటున్నారు. వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సెలబ్రిటీల జాతకం చూసి వాళ్ళ జీవితాల్లో జరగబోయే సంఘటనలను ముందుగానే ఊహించి చెబుతారు. గతంలో సమంత విడాకులపై, నయనతార పెళ్లిపై కూడా కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రష్మిక పొలిటికల్ ఎంట్రీ పై వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
ఈ కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్‌గా ఎంపికైంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన పీరియాడికల్ లవ్ స్టోరీ సీతారామంలో రష్మిక .. అఫ్రీన్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటించింది. Photo : Instagram
రష్మిక తన కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ ఇలా బిగ్గీలతో ఇతర హీరోయిన్స్‌తో పోల్చితే అగ్రస్థానంలో ఉన్నారు. ముఖ్యంగా పుష్ప విజయం తర్వాత రష్మిక హిందీలో అద్భుతమైన క్రేజ్‌ను తెచ్చుకున్నారు. ఒక్క హిందీలో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో పుష్ప 2, తమిళంలో వారిసు (వారసుడు) చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఈ రేంజ్లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో ఏ భామకు ఇంత మంచి ప్యాన్ ఇండియా లైనప్ లేదు. దీంతో తోటి హీరోయిన్స్ తెగ కుళ్లు కుంటున్నారట. రష్మిక తన లైఫ్‌లో ప్రస్తుతం పీక్‌లో ఉన్నారని.. ఈరేంజ్‌లో సినిమాలు ఏ తెలుగు హీరోయిన్‌కు లేవని.. అంటున్నారు సినీ విశ్లేషకులు. Photo : Instagram
రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. Photo : Instagram
రష్మిక మందన్న..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. Photo : Instagram
కన్నడలో ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్‌తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం. Photo : Twitter
పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో అలరించారు రష్మిక మందన్న. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేశారు. సుకుమార్ దర్శకుడు. ఈ సినిమా 2021 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ‘పుష్ప’ సక్సెస్‌తో ఇటు తెలుగులో కాదు.. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ భామ క్రేజ్ అమాంతం పెరిగింది. అందుకే ఇపుడు చేయబోతున్న సినిమాలకు ఏకంగా తన రెమ్యునరేషన్‌ను డబుల్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. Photo : Twitter