Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఓ టీవీల్లో వివిధ షోలకు యాంకరింగ్‌గా చేస్తూనే సినిమాల్లోను నటిస్తూ అదరగొడుతున్నారు అనసూయ. ఈ భామకు ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో ద్వారా సూపర్ పాపులారిటీ వచ్చింది. తన మాటలతోనే కాకుండా అందచందాలతో అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ అందాల యాంకర్. Photo : Instagram
ఈ సినిమాలతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కూడా అనసూయ కనిపించనుంది. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. Photo : Instagram
ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని (Anchor Anasuya) తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. ఈ సినిమాతో పాటు అనసూయ మహరాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి సినిమాలో నటించింది. Photo : Instagram
ఇక అనసూయ ఇటీవల పుష్ప సినిమాలో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి రెండో పార్ట్ షూటింగ్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 సినిమా షూటింగ్ ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ నెలలో మొదలుకావాల్సి ఉంది.. Photo : Instagram.
అయితే ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యేలా లేదని టాక్. దాదాపు మూడు నాలుగు నెలల వరకు ఈ రెండో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపించట్లేదని అంటున్నారు. అయితే విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. దీంతో ఈ సినిమా విడుదల ఈ ఏడాదిలో ఉంటుందో లేదో చూడాలి. ఇక పుష్ప (Pushpa) సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా అన్ని అంచనాలు తగ్గట్టే సాలిడ్ హిట్‌గా నిలిచింది. . Photo : Instagram
ఈ సినిమా ఇటు సౌత్‌లో కంటే అటు నార్త్‌లో కేక పెట్టించింది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప. హిందీలో రాకింగ్ స్టార్ నటించిన కేజీయఫ్ చిత్రం లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్ళను అల్లు అర్జున్ పుష్ప కేవలం 13 రోజుల్లో సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల వసూళ్లతో అక్కడ అదరగొట్టింది. పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది.. Photo : Instagram
ఇక ఈ సినిమాలో మిగితా పాటలతో పాటు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావాకు అదిరే రెస్పాన్స్ దక్కించుకుంది. ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ, మంగలం శ్రీనుగా సునీల్ అదరగొట్టారు. హీరోయిన్గా రష్మిక మందన్న (Rashmika Mandanna) శ్రీవల్లి పాత్రలో మైమరిపించారు. పుష్పలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలు చేశారు. Photo : Instagram
ఇక ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song) అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు... Photo : Instagram