అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ అరాచకం చేసింది. సంచలనాలు సృష్టిస్తుంది. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా అలాగే వచ్చాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. మూడో రోజు కూడా ఈ చిత్రం దాదాపు 25 కోట్ల షేర్ వసూలు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల్లోనే 14.40 కోట్ల షేర్ ఉంది.
పుష్ప సినిమాకు 150 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమాకు 84 కోట్ల షేర్ వచ్చింది. అయితే తర్వాత కూడా ఇదే జోరు కంటిన్యూ అయితే పుష్ప కమర్షియల్గా సేఫ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం అంత దూరం వెళ్లడం కష్టమే కానీ బన్నీ నటన చూడ్డానికి థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు ఆడియన్స్.