అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి నాలుగు రోజుల వరకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత అల్లు అర్జున్ సినిమాకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప సేఫ్ అవ్వడం ఈజీ కాదు. హిందీ, తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప.
ట్విట్టర్ రివ్యూ,పుష్ప మూవీ రివ్యూ" width="1600" height="1600" /> వీక్ డేస్లో పుష్ప చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగులో బాగా పడిపోయాయి కలెక్షన్స్. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో 68 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరి వారం రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..
పుష్ప సినిమాకు 150 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. వారం రోజుల్లో ఈ సినిమాకు 112 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే పుష్పకు కోరుకున్న వసూళ్లు రావడం లేదు. ఇక్కడింకా సేఫ్ అవ్వాలంటే కనీసం 35 కోట్లు రావాల్సిందే. ప్రస్తుతానికి అయితే పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు.