ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా కెరీర్లో ఓ కలల ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. తాను రిటైర్ అయ్యేలోపు ఇలాంటి ఓ సినిమా చేయాలనుకుంటారు కొందరు దర్శకులు. రాజమౌళికి మహాభారతం అలాంటి ఓ కల. తాను ఎన్ని సినిమాలు చేసినా కూడా అది కేవలం మహా భారతం చేయడానికి ప్రాక్టీస్ మాత్రమే అని చెప్తుంటాడు దర్శక ధీరుడు. అలా తెలుగులో మరో దర్శకుడికి కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆయనే పూరీ జగన్నాథ్.
ఈ సెన్సేషనల్ డైరెక్టర్‌కు ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో కోరిక. అదే జన గణ మన. ఈ సినిమాతో దేశానికి ఏదో చెప్పాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు పూరీ. మూడేళ్ల కింద 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు.
ఇస్మార్ట్ హిట్‌తో బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్ ఇచ్చినా కూడా పూరీ మాత్రం తర్వాతి సినిమా కోసం చాలా రోజుల పాటు వేచి చూసాడు. చివరికి విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో లైగర్ వచ్చేస్తుంది. ఆగస్ట్ 25న విడుదల కానుంది లైగర్.
విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు.. ఊహించని విధంగా మేకోవర్ అయ్యాడు. అంతేకాదు నగ్నంగా కూడా నటించడం మరో సంచలనం అనుకోండి. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత పూరీ ఏం చేయబోతున్నాడనే ప్రశ్నకు సమాధానంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ జన గణ మన పేరు వినిపిస్తుంది. ఈ కథ మహేష్ బాబు కోసం రాసుకున్నాడు పూరీ. కానీ ఆయన చేయను అనేసరికి ఆ తర్వాత పవన్ సహా ఇదే కథను చాలా మంది స్టార్ హీరోల దగ్గరికి తీసుకెళ్లాడు పూరీ జగన్నాథ్.
ఆ మధ్య కన్నడ హీరో, కేజియఫ్ స్టార్ యశ్‌ను కూడా కలిసి కథ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్ లాంటి హిందీ హీరోలను కూడా ట్రై చేసాడు పూరీ జగన్నాథ్. అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగు హీరో దగ్గరే ఈ కథ ఆగిపోయినట్లు తెలుస్తుంది. లైగర్ హీరో విజయ్ దేవరకొండతోనే జన గణ మన పాడిస్తున్నాడు ఈయన.
లైగర్ సినిమాలో విజయ్ నటనకు.. డెడికేషన్‌కు ఫిదా అయిపోయిన పూరీ.. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు సరైన హీరో ఆయనే అని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాదు #JGM అంటూ ఓ పోస్టర్స్ విడుదల చేసారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి నిర్మాతల్లో ఒకడు కావడం గమనార్హం. కథ నచ్చి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు వంశీ.
పైగా ఈ సినిమా పోస్టర్లో విజయ్ దేవరకొండ మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు చెప్పకనే చెప్పాారు. మరి ఇంగ్లీష్, కొరియన్ భాషల్లో ఈ తరహా చిత్రాలొచ్చాయి. తెలుగు సహా మన దేశంలో ఈ తరహా కథ కొత్తదే కాబట్టి.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేడి చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు చూసి విజయ్ దేవరకొండ అభిమానులు ఫిదా అవుతున్నారు. JGM పేరుతో విడుదలైన పోస్టర్స్ పిచ్చెక్కిస్తున్నాయి. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. (Twitter/Photo)
ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా కెరీర్లో ఓ కలల ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. తాను రిటైర్ అయ్యేలోపు ఇలాంటి ఓ సినిమా చేయాలనుకుంటారు కొందరు దర్శకులు. రాజమౌళికి మహాభారతం అలాంటి ఓ కల. తాను ఎన్ని సినిమాలు చేసినా కూడా అది కేవలం మహా భారతం చేయడానికి ప్రాక్టీస్ మాత్రమే అని చెప్తుంటాడు దర్శక ధీరుడు. అలా తెలుగులో మరో దర్శకుడికి కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆయనే పూరీ జగన్నాథ్.