అదా శర్మ టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. అదా ఎక్కువగా తను చేసిన సినిమాల కంటే గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులర్ అయింది. వరుస సినిమాలు చేస్తూనే గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేయడం అదా స్టైల్. ఈ రోజు ఈ అమ్మడి పుట్టినరోజు. ఈమెను దర్శకుడు పూరీ జగన్నాథ్ వెండితెరకు పరిచయం చేసారు. మొత్తంగా పూరీ పరిచయం చేసిన హీరోయిన్స్ లిస్టులో చాలా మందే ఉన్నారు.
డాషింగ్ పూరీ జగన్నాథ్ 22ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ‘బద్రి’ సినిమాతో దర్శకుడు అయ్యారు. వైకుంఠపాళీలో పాము నోట్లో పడ్టట్టు ఎన్నో ఫ్లాపులు చవిచూసాడు. ప్లాపులతో పనైపోయిందన్న టైమ్‌లో తిరుగులేని హిట్‌తో మళ్లీ సత్తా చాటడం దర్శకుడిగా పూరీ జగన్నాథ్ స్లైల్. నేడు ఇస్మార్ట్ దర్శకుడు మెగాఫోన్ పట్టుకొని 22 యేళ్లు పూర్తైయింది. 22 యేళ్లలో ఈయన రేణు దేశాయ్ నుంచి అనన్య పాండే వరకు ఎంతో మందిని తెలుగు తెరకు పరిచయం చేశారు. (File/Photos)