ఇటీవల నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చోర్ బజార్ ప్రిరిలీజ్ ఈవెంట్లో పూరి జగన్నాథ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చోర్ బజార్ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పూరి స్టార్ అయ్యాక చాలామంది వచ్చారు కానీ ముందు వచ్చింది ఈ మహాతల్లే (పూరీ వైఫ్). సక్సెస్ అయ్యాక ఎన్నో రాంప్ లు, వాంప్ లు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అంటూ ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. ఇంకా ఆయన పూరి గురించి మాట్లాడుతూ.. సొంత కొడుకు సినిమా ఫంక్షన్‌కు రాకపోతే ఎట్లా.. మనం ఏం సంపాదించినా వారి కోసమే.. ఓ సామెత ఉంటుంది. దేశమంతా కళ్ళాపు జల్లాడు కానీ ఇంటి ముందు కళ్ళాపు జల్లడానికి టైం లేదు. ఎవరెవరినో స్టార్లని చేసావ్.. డ్యాన్స్ లు రాని వాళ్లతో డ్యాన్స్ లు చేయించావ్, డైలాగులు చెప్పడం రాని వాళ్ళతో డైలాగులు చెప్పించావ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Photo : Twitter
ప్రస్తుతం లైగర్ కోసం ముంబైలో ఉన్న పూరీ తన పాడ్ కాస్ట్ రూపంలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. పూరీ సినిమాలతో పాటు, పూరి మ్యూజింగ్స్ పేరుతో పాడ్‌కాస్ట్‌లను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాడ్ కాస్ట్లను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా బండ్లకు సరిపడే ఓ పాడ్ కాస్ట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. టంగ్ పేరుతో విడుదలైన ఈ వీడియో బండ్ల గణేష్ గురించేనని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇక ఈ సందర్భంగా పూరీ ఆ వీడియోలో.. నాలుకను అదుపులో ఉంచుకోవాలని, ఎందుకంటే ఒకరి జీవితం మరియు మరణం నాలుకపై ఆధారపడి ఉంటుందని, చౌకబారుగా మాట్లాడవద్దని, ప్రవర్తించవద్దని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter
ఇక పూరీ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లైగర్ అనే సినిమా చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. అనన్యపాండే హీరోయిన్గా (Ananya Panday) చేస్తున్నారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. Photo : Twitter
ఇక ఈ సినిమాలో ఐటెమ్ నెంబర్ ఉందట. ఈ పాటలో డాన్స్ చేసేందుకు టీమ్ ఇప్పటికే చాలా మందిని పరిశీలించారట. ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం కెజియఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ని సంప్రదించడమే కాదు.. ఆమె లైగర్‌లో సాంగ్ చేయబోతుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో శ్రీనిధికి బదులుగా రష్మిక మందన్న (Rashmika Mandanna) చేయబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Twitter
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్ (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. Photo : Twitter
లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. Photo : Twitter
ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. Photo : Twitter
విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది.ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. Photo : Twitter
ఇక విజయ్, సమంతలు కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విడి 11 పేరుతో వస్తున్న ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ ఖరారు అయ్యిందిని టాక్. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కశ్మిర్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. విజయ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. Photo : Twitter