పూరి ఇటీవలే... గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు. ఆ సినిమా హిట్ కావడంతో.. పూరి తన నెక్ట్స్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడని కూడా టాక్ వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా పూరిని కొందరు బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి,అంతేకాదు దీనికి సంబంధించిన ఓ ఆడియో కూడా వైరల్ అయ్యింది.
లైగర్ సినిమాతో పూరి జగన్నాథ్ తో పాటు బయ్యర్స్ కూడా కొన్ని కోట్లు నష్టపోయారు. అయితే సినిమా నష్టపోవడంతో తమ పరిస్థితి ఏంటి అని బయ్యర్స్ అడగడంతో అందరికి నష్టపరిహారం ఇస్తామని పూరి చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను భారీ ధరకు కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌కు దర్శకుడు, నిర్మాత పూరి, ఛార్మీలు కొంత మొత్తాన్ని వెనక్కు ఇచ్చేందుకు అంగీకరించారట. Puri Charmy Photo Twitte
పూరికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేసేందుకు రెడీ అవుతున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా దీనికి సంబంధించిన ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఓ క్లిపంగ్ షేర్ చేశారు. లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ల మధ్య థ్రెటింగ్ మెసేజ్ సర్క్యూలేట్ అవుతుందని వర్మ పోస్టు చేశారు. అయితే పూరి కూడా వెనక్కి తగ్గలేదు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ వరంగల్ శీనుతో పాటు మరో వ్యక్తిపై పోలీసులకుఫిర్యాదు చేశారు. Pavitra Puri Photo Twitter
పూరి తన నోట్లో‘ గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి? ఊపిరి ఒదిలెయ్యటమే. గెలుపోటములు కూడా అంతే, ఒకటి వస్తే ఇంకోటి పోక తప్పదు. పడతాం-లేస్తాం, ఏడుస్తాం-నవ్వుతాం, ఎన్నో రోజులు ఏడ్చిన తరువాత జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు’ అని పేర్కొన్నారు.
నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, ఊరు వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సన్నివేశాలు మాత్రమే. అందుకే లైఫ్ ని సినిమాలా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు.(Twitter/Photo)