ఇక ఈ మధ్య పలు టీవీ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న పృథ్వి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వైసీపీ పార్టీపై విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ (YS Jagan) అండ తనకు ఉంటుందని అనుకొని చాలామంది చాలా రకాలుగా మాటలు అన్నారని అంటూ ఆవేదన చెందుతున్నారు. కానీ చివరకు ఆ పార్టీలో తన స్థానం ఏంటో అర్థమైందని అంటున్నారు అర్థమైందని థర్టీ ఇయర్స్ పృథ్వీ.
మళ్ళీ వైసీపీకి వెళ్తారా అంటే.. చాలండి.. నమస్కారమండి అని అంటాను. వెళ్లే వాళ్లకైనా సిగ్గు, శరం ఉండాలి. నేనెప్పుడూ నా కులం గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టైమ్ చెబుతున్నా. తూర్పు గోదావరి జిల్లా చోళ్లంగిలో పుట్టిన కాపు బిడ్డగా చెబుతున్నా. అలాంటి పనులు మా జాతిలో ఎవడూ చేయడు అనేశారు పృథ్వి. మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్నట్లుగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
2024 ఎన్నికల జోస్యాన్ని కూడా చెప్పుకొచ్చాడు పృథ్వీ. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయాడు.. గెలవలేకపోయాడు అని అంటున్నారు.. నీయమ్మ 10 స్థానాల్లో కాదు.. వచ్చే ఎన్నికల్లో 40 సీట్లు కొట్టబోతోన్నాం.. నేను రాసిస్తాను.. ఘంటాపథంగా చెబుతున్నా జనసేన జెండా ఎగురుతుంది.. 2024 ఎన్నికల్లో ఆయనే కింగ్.. అంటూ పృథ్వీ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.