మోహన్ బాబు తన ఆస్తులు మొత్తం పిల్లలకి పంచి ఇచ్చేశారని, మోహన్ బాబు యూనివర్సిటీ బాధ్యతల్ని మంచు విష్ణు తీసుకున్నారని.. అయితే ఓ ఇష్యూలో క్లారిటీ కావాల్సి ఉండగా సారధితో చిన్న గొడవ జరిగిందని చిట్టిబాబు చెప్పారు. సారధిని పదే పదే తప్పించుకుని ఆ విషయం క్లారిటీ ఇవ్వకపోయేసరికి విష్ణు.. ఆ విషయం తేల్చుకోవడానికి సారధి ఇంటికి రావడం జరిగిందని అన్నారు.
సారధి ఇంటి వద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో విష్ణుని ఆపింది కూడా అతని అసిస్టెంట్లు గజేంద్ర, మిగిలిన వాళ్లే. ఆ సమయంలో మోహన్ బాబుకి ఒక్క కాల్ చేసి.. సారధి గురించి చెప్తే ఇష్యూ క్లోజ్ అయ్యేది కానీ.. ఈ విషయంలో విష్ణు నేరుగా సారధి ఇంటికి వెళ్లి గొడవ పడటం తప్పు అయితే.. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం మనోజ్ చేసిన తప్పు అని చిట్టిబాబు అన్నారు.
తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు విష్ణు ఉంటున్నారని, మంచు మనోజ్ వేరుగా ఉంటున్నారనే న్యూస్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. గత రెండు మూడేళ్లుగా మంచు విష్ణుకి మంచు మనోజ్ బర్త్ డే విషెస్ కూడా చెప్పకపోవడం, రీసెంట్ గా జరిగిన మంచు మనోజ్ రెండో పెళ్ళికి విష్ణు చుట్టంచూపుగా వచ్చి వెళ్లడంతో జనాల్లో అనుమానాలు ముదిరాయి.