పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కేతిక శర్మ హీరోయిన్స్‌గా వస్తోన్న సినిమా ‘రొమాంటిక్’. సరికొత్త కాన్సెప్ట్‌తో లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు. ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఇంతవరకు రిలీజ్‌కు నోచుకోలేదు. తాజాగా ఈ సినిమాను ఈ నెల అక్టోబర్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. Photo : Twitter
రొమాంటిక్.. సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది. ఆకాష్ పూరి, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించనుంది. అంతేకాదు రమ్యకృష్ణ ఆకాష్ పూరికి అత్త పాత్రలో కనిపించనుంది. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసినందుకు సినిమా రేంజ్ పెరిగిందని నిర్మాత ఛార్మి పేర్కోన్నారు. Photo : Twitter