Bandla Ganesh: రాజకీయాలపై మరోసారి బండ్ల గణేష్ సంచలన పోస్టు..!
Bandla Ganesh: రాజకీయాలపై మరోసారి బండ్ల గణేష్ సంచలన పోస్టు..!
టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ప్రస్తుతం రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఆయన తాజాగా రాజకీయాలపై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని తెలిపారు.
బండ్ల గణేష్.. ఈ పేరే ఒక బ్రాండ్. కాదు కాదు ఫైర్ బ్రాండ్. తన మాటల తూటాలతో జనం మదిలో అలా ఫిక్స్ అయిపోయారు బండ్ల గణేష్. ఆయన చేతికి మైక్ ఇస్తే ఆ మాటల సునామీకి అంతే ఉండదు. నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో హైలైట్ అవుతుంటారు బండ్లన్న.
2/ 7
బండ్ల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు రాజకీయాలు, సినిమాలపై తనదైన స్టైల్లో పోస్టులు పెడుతుంటారు. అయితే బండ్ల గణేష్ తాజాగా మరోసారి రాజకీయాలపై ఇంట్రస్టింగ్ పోస్టు చేశారు.
3/ 7
గతంలో రాజకీయాల్లో బండ్ల ఉన్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా తన ముద్ర వేసిన బండ్ల ఇప్పుడు రెండిటికీ కూడా కాస్త దూరం గానే ఉన్నారు. ఇక లేటెస్ట్ గా అయితే రాజకీయాల విషయంలో మాత్రం తాను మరింత దూరంగా ఉండనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పాలి.
4/ 7
సోషల్ మీడియాలో తాను మాట్లాడుతూ “రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అందరూ ఆత్మీయులే” అని స్పష్టం చేశారు. అయితే ఇందులో తన ఆరాధ్య దైవం పవన్ కూడా అతీతం కాదు అన్నట్టే స్పష్టం చేయడం విశేషం.
5/ 7
బండ్ల చేసిన తాజా పోస్టుతో .. ఇప్పుడు ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల వరకు అయితే పవన్ కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించినా బండ్ల ఇప్పుడు ఈ తరహాలో స్పందన వ్యక్తం చేయడం కొందరు పవన్ ఫ్యాన్స్ కి ఆశ్చర్యం కలిగిస్తుంది.
6/ 7
తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, నటుడిగా తన మార్క్ చూపించిన బండ్ల గణేష్.. రాజకీయ రంగంలో కూడా హైలైట్ అయ్యారు. రాజకీయ కోణంలో ఆయన చెప్పే మాటలు హాట్ ఇష్యూ అయిన సందర్భాలు బోలెడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకొని సడెన్ షాకిచ్చారు బండ్ల గణేష్.
7/ 7
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పని చేసిన బండ్ల గణేష్.. అదే సమయంలో 7'0 క్లాక్ బ్లేడ్ ఇష్యూతో చర్చల్లో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అని చెప్పి అలజడి సృష్టించిన విషయం మనకు తెలిసిందే.