విజయ్ దేవరకొండ `టాక్సీవాలా`తో సక్సెస్ అందుకుని ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించింది ప్రియాంక జవాల్కర్. అందులో గ్లామర్ పరంగానూ ఫిదా చేసింది. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో ఎట్టకేలకు బ్యాక్ టూ బ్యాక్ క్రేజీ ఆఫర్లని దక్కించుకుంది. అందులో భాగంగా ఇటీవల సత్యదేవ్ సరసన `తిమ్మరుసు` చిత్రంలో నటించింది. ఈ సినిమా శుక్రవారం విడుదలై సక్సెస్ టాక్ని తెచ్చుకుంది. (Photo Credit : Instagram)
తాజాగా తిమ్మరుసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ తెలుగు అందం. సత్య దేవ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాతో పాటు `ఎస్.ఆర్. కళ్యాణమండపం` సినిమా ఆగస్టు 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతోందన్న నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. (Photo Credit : Instagram)
అందం అభినయంతో ఆకట్టుకుంటోన్న ప్రియాంక జవాల్కర్ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా యంగ్ హీరోలకు.. దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. ప్రియాంక నటించిన మరో కొత్త సినిమా `గమనం` కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన ప్రియాంక.. ఇప్పుడు స్లిమ్ లుక్‌లోకి మారి ఆకట్టుకుంటోంది. (Photo Credit : Instagram)