ప్రియాంక జవాల్కర్ మన తెలుగు అమ్మాయే.. 1992, నవంబరు 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో జన్మించింది. ఈమె పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందినవారు, వాళ్ళ అనంతపురంలో స్థిరపడ్డారు. పదవతరగతి వరకు అనంతపురంలోని ఎల్.ఆర్.జి. హైస్కూల్ లో చదివిన ప్రియాంక, హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ రెస్టారెంట్లో అబ్బాయితో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఓ రెస్టారెంట్ లో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్న ఉన్న ఫొటోను షేర్ చేసింది. కానీ తెలివిగా తన బాయ్ ఫ్రెండ్ ను బ్యాక్ నుంచి మాత్రం చూపించింది. ఆయన ఫొటోలు తీస్తుంటే క్యూట్ గా పోజులిచ్చిందీ బ్యూటీ.
తనతో ఫొటోలో ఉన్న వ్యక్తి ఇండియన్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యరే (Venkatesh Ayyar) అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్యాక్ నుంచి నెక్ భాగం అచ్చు వెంకటేశ్ లానే అనిపించడంతో పక్కా ఆయనే అంటూ మరికొద్దరు అభిప్రాయపడుతున్నారు. ఈపిక్స్ షేర్ చేస్తూ ప్రియాంక 'అతనే లవ్' అంటూ హార్ట్ ఎమోజీ వదులుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
గతంలోనూ ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోపై క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫొటోకు 'క్యూట్' అంటూ కామెంట్ చేయడంతో.. రిప్లైగా అయ్యర్ కామెంట్‌పై 'ఎవరు? నువ్వా..' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో చాలామంది ప్రియాంకను ట్రోలింగ్ కూడా చేశారు. నీ వెంకటేష్ క్రికెటర్ అయ్యర్ తెలియదా అంటూ కామెంట్లు పెట్టారు.