Priyanka Chopra : ప్రియాంకా చోప్రా (Priyanka Chopra)…ఒకానొక టైంలో బాలీవుడ్ ను షేక్ చేసిన బ్యూటీ. ఈ భామ అమెరికన్ సింగర్ నిక్ జోనస్ (Priyanka Chopra Jonas)ను పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు మన దేశానికి దూరమైపోయిందనే చెప్పాలి. అయిన తన ఫోటోషూట్స్‌తో ఎపుడు అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా ముంబైలో జరిగిన నీతా అంబానీకి సంబంధించిన NMACC ఈవెంట్‌కు తన భర్తతో కలిసి సందడి చేసింది.
ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్ అని తెలిసిందే.. మొదట్లో హిందీ చిత్రాల్లో నటించిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో తన సత్తాను చాటుతోంది. ఇక ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ప్రియాంక తెలుగులో రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా హిందీలో జంజీర్గా విడుదలైంది. అక్కడ ఈ సినిమా డిజాస్టర్ అయింది. (Instagram/Photo)