Met Gala 2019 : మెట్‌ గాలా వేడుకలో అదరగొట్టిన ప్రియాంక, దీపికా, ఈషా అంబానీలు

Met Gala 2019 : అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మెట్‌ గాలా వేడుక సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె తమదైన అలంకరణతో ఎప్పటిలాగే అదరగొట్టారు. ప్రియాంక.. రింగుల జుట్టు, సిల్వర్‌ రంగు గౌనులో ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలివగా.. దీపికా గులాబీ రంగు గౌనులో బార్బీ బొమ్మలా తయారై...చూపరలను ఆకట్టుకుంది. అంతేకాకుండా.. ఈ వేడుకలో రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌అంబానీ కుమార్తె ఈషా అంబానీ, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రబల్‌ గురుంగ్‌ డిజైన్‌ చేసిన గౌనులో హాజరై సందడిచేశారు.