PRIYANKA CHOPRA AND NICK JONAS WELCOME BABY VIA SURROGACY HERE IS HER INSTAGRAM POST SK
Priyanka Chopra: బిగ్ సర్ప్రైజ్.. తల్లైన ప్రియాంక చోప్రా.. అంతా సీక్రెట్‌గానే..
Priyanka Chopra: ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ జంట బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ స్టార్ కపుల్ పేరెంట్స్ అయ్యారు. దంపతులిద్దరు ఈ విషయాన్ని ఇన్‌స్టగ్రామ్ వేదికగా స్వయంగా ప్రకటించారు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా తల్లయింది. తమకు బిడ్డ పుట్టిందని ప్రియాంక చోప్రా, ఆమె భర్త నికో జోనస్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు.
2/ 9
ప్రియాంక, నిక్ పోస్ట్‌లను చూసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ప్రియాంక చోప్రా గర్భం దాల్చిందన్న విషయమే బయటకు రాలేదు. ఆమె గర్భంతో కనిపించిన సందర్భాలు కూడా లేవు. కానీ తాము పేరెంట్స్ అయ్యామని సడెన్‌గా ప్రకటించారు. (Image:Instagram)
3/ 9
ఐతే వాస్తవానికి ప్రియాంక చోప్రా స్వయంగా బిడ్డకు జన్మనివ్వలేదు. సరోగసి విధానంలో వీరిద్దరు తల్లిదండ్రులయ్యారు. అద్దె గర్బం విధానంలో బిడ్డకు జన్మనిచ్చారు. (Image:Instagram)
4/ 9
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ఇన్‌స్టగ్రామ్ పోస్ట్ (Image:Instagram)
5/ 9
.ఐతే ఆడ బిడ్డ పుట్టిందా? లేదంటే మగ బిడ్డ జన్మించాడా? అనే విషయాన్ని మాత్రం వీరు వెల్లడించలేదు. ఈ ప్రత్యేక సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. (Image:Instagram)
6/ 9
అమెరికన్ వెబ్సైట్ NMZ కథనం ప్రకారం.. ప్రియాంక చోప్రాకు ఆడ పుట్టినట్లు సమాచారం. కాలిఫొర్నియాలోని ఓ ఆస్పత్రిలో శనివారం పాప పుట్టినట్లు తెలిసింది. (Image:Instagram)
7/ 9
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ జంటకు ఈ బిడ్డే తొలి సంతానం. వీరిద్దరు పేరెంట్స్ అయ్యారని తెలిసి.. చాలా మంది సెలబ్రిటీలు విష్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. (Image:Instagram)
8/ 9
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్దతుల్లో మూడు రోజుల పాటు వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. (Image:Instagram)
9/ 9
ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ఖాతాల్లోని ఐడీల్లో భర్త పేరును తొలగించడంతో.. వీరిద్దరు విడిపోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో వీరిద్దరు తల్లిదండ్రులవడం విశేషం. (Image:Instagram)