Priyanka Arul Mohan : నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'గ్యాంగ్ లీడర్' తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. ;ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఈ భామ రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నంలో ఉన్నారు. (Instagram/Photo)
సినిమా పరిశ్రమలో కష్టమొకటో సరిపోదు. అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక హీరోయిన్స్ విషయంలో ఇదే విషయాన్ని అన్వయించాలంటే.. గ్లామర్ ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ విషయంలో ఈ సూత్రం పక్కాగా సరిపోతుందని అంటున్నాయి సినీ వర్గాలు. (Instagram/Photo)
ఎందుకంటే.. నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం చిత్రాల్లో ఈ అమ్మడు హీరోయిన్గా నటించింది. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తమిళంలో మంచి అవకాశాలే వస్తున్నప్పటికీ, తెలుగులో మాత్రం ప్రియాంక అరుల్ మోహన్‌కు హీరోయిన్గా అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. (instagram/Photo)