Pawan Kalyan - Priyamani: టాలీవుడ్ నటి ప్రియమణి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కొన్ని ఏళ్ళ కిందట పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. మళ్లీ రీ ఎంట్రీతో వరుస సినిమాలతో బాగా బిజీగా మారింది. అంతేకాకుండా బుల్లితెరపై కూడా ఢీ డాన్స్ షోలో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరో అవకాశాన్ని అందుకోగా అందులో ఓ స్టార్ హీరో సరసన నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఇక వీటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇందులో ప్రియమణి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.