భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాలో చిరు రెండు పాత్రల్లో నటిస్తే.. అందులో వయసు మీరిన ఏజ్డ్ పాత్రకు ఈమె జోడిగా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రియమణి కెరీర్‌కు హెల్ప్ అవుతుందనే నమ్మకంతో ఉంది. తాజాగా ఈమె చిరంజీవి అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లో ఈమె ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం.(Instagram/Photo)
ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'యమదొంగ' సినిమా ద్వారా మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటు మరింత పాపులర్ అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత చాలా చిత్రాల్లో ఆమె నటించింది. ప్రియమణి ఇటు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ సినిమాల్లో నటించి తన అందచందాలతో పాటు నటనతో మంచిపేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు ప్రియమణి పూర్తిపేరు ప్రియ వాసుదేవ మణి అయ్యర్. Photo : Instagram
ఈ చిత్రంతో పాటు ప్రియమణి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా వేణు ఊడుగుల దర్శకత్వలో తెరకెక్కుతున్న విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్కగా నటిస్తోంది. ఆ లుక్‌లో ప్రియమణి ఓ తుపాకీ పట్టుకుని హుషారుగా కనిపిస్తోంది. ఇక ప్రియమణి ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వివిధ రకాల రియాలీటి షోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తోంది. Photo : Instagram
విరాటపర్వం (Virata Parvam) విషయానికి వస్తే... రానా (Rana Daggubati ), సాయిపల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. Photo : Instagram
ఆ తర్వాత జగపతి బాబు హీరోగా వచ్చిన 'పెళ్లైన కొత్తలో' సినిమాతో తెలుగువారికి మరింత పరిచయమైంది. ప్రియమణి తమిళ సినిమా పరుత్తివీరన్‌లో ఫీమేల్ లీడ్‌గా కార్తీ సరసన నటించి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. ఇక ఆమె నటించిన ‘భామా కలాపం’ సినిమా ఆహాలో విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది. Priyamani Instagram